అదరగొడుతున్న కోహ్లీ.. ఫైనల్ దిశగా టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీ - 2025లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లీలో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో కోహ్లీ మరోసారి ఆకట్టుకున్నాడు. దాయాదుల పోరులో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ, కీలకమైన సెమీస్‌లో అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 54 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. రోహిత్ శర్మ,శుభ్‌మన్ గిల్ వికెట్లను టీమిండియా కోల్పోయింది.అర్థ సెంచరీ దగ్గరకు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 45 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

దీంతో టీమిండియా మూడు ప్రధాన వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీతో పాటు, అక్షర్ పటేల్ ఉన్నాడు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన 264 పరుగులకు అలౌట్ అయింది. స్మిత్ 73,అలెక్స్ క్యారీ 61,ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్లు కూడా రాణించారు. వరుణ్, జడేజాలు చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇక అక్షర్, హార్దిక్ ఖాతాలో ఒక వికెట్ పడింది. ప్రస్తుతం భారత జట్టు 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ - 2025లో భాగంగా, తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. రేపు(బుధవారం) రెండో ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications