పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు దెబ్బతగిలించుకోవడమేంట్రా..!!
ఆసియా కప్ 2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య నేడు మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. యార్క్ రైవల్స్ మధ్య జరిగే హైఓల్టేజ్ గేమ్ ఇది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లల్లో పాకిస్తాన్ చేతిలో ఓటమి ఎరుగని చరిత్ర ఉంది టీమిండియాకు. పాకిస్తాన్ ఇప్పుడున్న ఫామ్ ను బట్టి చూస్తోంటే- భారత్ దీన్ని నిలబెట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఒమన్ పై దుమ్ము రేపింది. బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్ లో మాత్రం చెలరేగింది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఒమన్ ను జస్ట్.. 67 పరుగులకే కుప్పకూల్చింది. బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించుకుంది పాకిస్తాన్. ఆరుమంది బౌలింగ్ చేస్తే.. వాళ్లందరికీ వికెట్లు దక్కాయి. ఒక్కరు కూడా ఖాళీ చేతులతో మ్యాచ్ ను ముగించలేదు.

హోరాహోరీగా సాగుతుందనుకుంటోన్న దశలో టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. స్టార్ ఓపెనర్, వైస్ కేప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో అతని చేతికి గాయమైనట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రాక్టీస్ సమయంలో చాలా అసౌకర్యంగా కనిపించాడు. నెట్ ప్రాక్టీస్ కు దూరం అయ్యాడు. బంతి మోచేతిని బలంగా తగిలిన వెంటనే బాధతో విలవిల్లాడాడు. ఆ వెంటనే గిల్ ప్రాక్టీస్ ను వదిలేసి ఐస్‌బాక్స్ పై కూర్చోవడం కనిపించింది. టీమ్ ఫిజియోథెరపిస్ట్ అతన్ని పరీక్షించాడు.
ఈ ఘటన తర్వాత కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. గిల్‌తో చాలాసేపు మాట్లాడారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అతనికి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు. దాన్ని అతనే ఓపెన్ చేశాడు. కొంత రిలీఫ్ తర్వాత గిల్ మళ్లీ నెట్స్‌లోకి అడుగు పెట్టాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరమైతే, అతని స్థానంలో సంజు శాంసన్ ఇన్నింగ్ ను ఆరంభించే అవకాశం ఉంది.
సంజు శాంసన్ టీ20లలో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ బ్యాటర్. గత ఏడాది టీ20లలో ఓపెనర్‌గా మూడు సెంచరీలు సాధించాడు. సంజు శాంసన్ ఓపెనింగ్ కు వస్తే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లో స్వల్పంగా మార్పులుచేర్పులు చోటు చేసుకోవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాటర్లను మిడిలార్డర్ కు మళ్లించే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్.. మిడిల్- లోయర్ ఆర్డర్ భారాన్ని మోయాల్సి రావొచ్చు.












Click it and Unblock the Notifications