40 ఏళ్ల శాప విముక్తం: రౌండ్ ఆఫ్ 16లో మెక్సికో- కరవుదీరా

ఫిఫా వరల్డ్ కప్‌ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆతిథ్య దేశం మెక్సికో జట్టు నూతన చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఈక్వెడార్‌ను 2-0 తేడాతో కుప్పకూల్చింది. రౌండ్ ఆఫ్ 16లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇది ఆ జట్టుకు చారిత్రాత్మక విజయం అనడంలో సందేహాలు అక్కర్లేదు. 40 ఏళ్లుగా నాకౌట్ దశ దాటలేదా జట్టు. ప్రతీసారీ కూడా రౌండ్ ఆఫ్ 32లోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసిపోయేది.

ఇప్పుడా దశను దాటుకుంది. 40 ఏళ్ల శాపం నుంచి విముక్తి పొందింది. నాకౌట్ దశలో గెలుపు నిరీక్షణకు ఎట్టకేలకు శుభం పలికింది. ఈ విజయం.. ఆ జట్టుకు మరుపురాని అనుభూతిగా నిలిచిపోనుంది. సొంతమైదానంలో అభిమానుల హోరు మధ్య ప్రారంభమైన ఈ ఉత్కంఠ పోరులో మెక్సికో ఆటగాళ్లు మొదటి నిమిషం నుంచే పూర్తి దూకుడు ప్రదర్శించారు. తొమ్మిది నిమిషాల స్వల్ప వ్యవధిలోనే ప్రత్యర్థి ఈక్వెడార్ బలమైన డిఫెన్స్‌ను చేధిస్తూ అద్భుతమైన గోల్స్ సాధించారు.

Mexico Breaks 40-Year Knockout Drought Defeat Ecuador with 2-0 Advances to Round of 16 in FIFA

ఆట 22వ నిమిషంలో జూలియన్ క్వినోనెస్ చక్కటి ఫీల్డ్ గోల్‌తో మెక్సికో జట్టుకు తొలి ఆధిక్యాన్ని అందించి అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తాడు. ఈ జోరు ముగియకముందే తొమ్మిది నిమిషాల తర్వాత అంటే సరిగ్గా 31వ నిమిషంలో మెక్సికో సీనియర్ ఆటగాడు రౌల్ జిమెనెజ్ తనకు దక్కిన సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మరొక అద్భుతమైన గోల్ జట్టు ఖాతాలో వేశాడు. దీంతో మ్యాచ్ మొదటి అర్ధభాగంలోనే ఆతిథ్య మెక్సికో జట్టు ఈక్వెడార్‌పై తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.

మ్యాచ్ ముగిసే వరకు ఈ రెండు గోల్స్ ఆధిక్యాన్ని విజయవంతంగా కాపాడుకుని ప్రపంచకప్‌లో అత్యంత చిరస్మరణీయ విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయం మెక్సికో దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది. తమ సొంత దేశంలోనే జరిగిన 1986 ఫిఫా వరల్డ్ కప్‌లో బల్గేరియాను రౌండ్ ఆఫ్ 16 లో ఓడించిన తర్వాత నుంచి మెక్సికో మళ్లీ ఇంతవరకు నాకౌట్ మ్యాచ్‌ గెలవలేదు.

ఆ తర్వాత జరిగిన 1994, 1998, 2002, 2006, 2010, 2014, 2018 ప్రపంచకప్‌ టోర్నమెంట్లలో మెక్సికో ప్రతిసారీ రౌండ్ ఆఫ్ 16 లోనే పరాజయాన్ని పొంది నిరాశగా వెనుదిరిగింది. 2022 ఖతార్ ప్రపంచకప్‌లో మరీ ఘోరంగా కనీసం గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది. వరుసగా ఎదురైన ఎదురుదెబ్బల తర్వాత మళ్లీ సొంత వేదికపై గెలిచి నాకౌట్ ముద్ర వేసుకోవడం మెక్సికో జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. రౌండ్ ఆఫ్ 16లో తన తదుపరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ లేదా డీఆర్ కాంగోతో తలపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+