Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్: సత్య నాదెళ్లకు నిద్రలేదు!, ఏమన్నారంటే?

వాషింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను యావత్ దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. బ్యాటింగ్ తోపాటు బౌలింగ్‌లోనూ భారత్ అత్యద్భుతంగా ఆటతీరును కనబర్చింది. ఒకనొక దశలో ఉత్కంఠగా సాగినప్పటికీ.. భారత బౌలర్లు ఆటను తమవైపునకు తిప్పుకుని విజయ తీరాలకు చేర్చారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులతోపాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) కూడా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం తన నిద్రను వదులుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. సియాటెల్‌లో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కీలక ఉపన్యాసం చేసి వచ్చిన తర్వాత పూర్తిగా భారత్-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మునిగిపోయినట్లు సత్య నాదెళ్ల తెలిపారు.

 microsoft ceo satya nadella stayed up all night to watch india vs new zealand semi final match

ఈ మ్యాచ్ కోసం రాత్రంతా మేల్కొని ఉన్నట్లు నాదెళ్ల వెల్లడించారు. ఇగ్నైట్ పేరిట నిర్వహించిన కాన్ఫరెన్స్‌ను షెడ్యూల్ చేసినప్పుడు తమకు మ్యాచ్ జరుగుతుందనే విషయంపై అవగాహన లేదన్నారు. అయితే, చివరకు రాత్రాంతా మేల్కొని మ్యాచ్‌ను వీక్షించినట్లు సత్య నాదెళ్ల తెలిపారు. అద్భుత ప్రదర్శనతో భారత జట్టు గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు.

వన్డే మెన్స్ ప్రపంచ కప్ (ODI world cup 2023) టోర్నీ సెమీ ఫైనల్లో కివీస్ ను ఓడించిన భారత్.. సెమీస్‌కు దూసుకెళ్లింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ సెమీస్‌లో కవీస్‌పై 70 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 50వ శతకం చేసి ప్రపంచ క్రికెట్‌లో రికార్డ్ సృష్టించాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత శతకం బాదాడు. దీంతో భారత్ 4 వికెట్లు కోల్పోయి 397 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఓపెనర్లుగా వచ్చిన శుభమన్ గిల్, రోహిత్ శర్మ తోపాటు కేఎల్ రాహుల్ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఏడు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరింది. గురువారం దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్లో తలపడనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+