నవ్వాపుకుంటున్నావ్ కదరా: 15వ తేదీ ఉంటదిలే..పాక్‌‌కు రక్త కన్నీరే..!!

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తన నిర్ణయం నుంచి పాకిస్తాన్ చివరకు వెనక్కి తగ్గింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.ఈ నిర్ణయానికి ముందు పలు వారాలపాటు అనిశ్చితి నెలకొంది. పాకిస్తాన్ మొదట భారత్‌తో ఆడబోమని స్పష్టం చేసింది. అయితే, ఐసీసీ, శ్రీలంక క్రికెట్ ఇతర సభ్య దేశాల బోర్డులతో జరిగిన చర్చల అనంతరం పాకిస్తాన్ టీమిండియాతో మ్యాచ్ ఆడటానికి అంగీకరించింది. దీంతో వివాదానికి తెరపడింది.

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత జట్టుతో మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని జట్టు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అనుమతి పొందింది.అయితే ఐసీసీపై అలిగి తామేదో సాధించేశామనే ఫీలింగ్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలానే పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసి ఐసీసీపై పైచేయి సాధించామనే భావనలో పాక్ ఉంది.

Mohsin Naqvi Applauded in India-Pak Controversy Multan Sultans Owner Ahsan Tahir Reaction Goes Viral

వైరల్ వీడియో - నవ్వును ఆపుకున్న యజమాని

ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 వేలం సందర్భంగా జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్-పాకిస్తాన్ వివాదంలో ఐసీసీని "మోకాళ్లపై నిలబెట్టారని" అంటూ ఒక రిపోర్టర్ పీసీబీ చీఫ్ Mohsin Naqviపై పొగడ్తల వర్షం కురిపించాడు.ఆ సమయంలో నఖ్వీ పక్కనే కూర్చున్న మల్తాన్ సుల్తాన్స్ కొత్త యజమాని ఆషాన్ తాహిర్ ఆ వ్యాఖ్యలు విని నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నించిన దృశ్యం కెమెరాల్లో చిక్కింది.ఆ వ్యక్తి స్పందనతో వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాలో స్పందన

వైరల్ వీడియోపై 'ఎక్స్' వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.రిపోర్టర్ నఖ్వీని ప్రశంసలతో పొగడటం, ఆ పక్కనే ఉన్న మనిషి దానికి ఎగబడి నవ్వడం.. ఇదంతో చూస్తే చాలా ఎబెట్టుగా ఉందని పలువురు నెటిజెన్లు కామెంట్ చేశారు. వాస్తవానికి ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసని.. పీసీబీ చీఫ్ వద్ద మెహర్బానీ కోసం ఆ రిపోర్టర్ ఆకాశానికెత్తేసినట్లుందని మరికొందరు నెటిజెన్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే భారత్‌తో ఆడిన ప్రతిసారీ పాకిస్తాన్‌కు భంగపాటు తప్పడం లేదని ఈ సారి ఓడి మళ్లీ తమ సొంత గడ్డపై ప్రజల ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేకే... బంగ్లాదేశ్‌ను బూచిగా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేసిందని స్పష్టంగా అర్థమవుతోందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఇదే ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పీసీబీ చీఫ్ నఖ్వీ బంగ్లాదేశ్‌కు జరిగిన అవమానం తమ సోదరులకు జరిగినట్లుగా భావించామని చెప్పుకొచ్చారు. అందుకే బంగ్లాదేశ్‌కు అండగా నిలబడి వారికి గౌరవం తెచ్చేందుకు భారత్‌తో మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.ఇక బంగ్లాదేశ్ ఏవైతే డిమాండ్లు ఐసీసీ ముందు ఉంచిందో అన్నిటికీ ఆమోదం తెలిపినట్టు మోషిన్ గుర్తుచేశారు.పాక్ ప్రభుత్వం కూడా ఆమేరకే నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.బంగ్లాదేశ్ డిమాండ్‌లకు ఆమోదం తెలపడం,వారికి జరిగిన అన్యాయం గుర్తించడంతో పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు నిర్ణయించుకుందని నఖ్వీ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+