MS Dhoni ఒక్క మ్యాచ్ ఆడలేదు, IPL సంపాదన ఎంతో తెలుసా..!?
MS Dhoni. మిస్టర్ కూల్ గా క్రికెట్ ఫ్యాన్స్ అభిమానించే ధోనీ.. ఈ సారి ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయింది. చెన్నై లో ఈ సీజన్ చివరి మ్యాచ్ తరువాత ధోనీ బయటకు వచ్చాడు. పీఎల్ చరిత్రలోనే ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఒక సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి కావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే.. సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీకి ఈ సీజన్ ఆదాయ లెక్కలు ఆసక్తి కరంగా మారాయి.
ఐపీఎల్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్స్ లో నాలుగో టీం పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరకుండానే చెన్నై నిష్క్రమించింది. ఈ సీజన్ మొత్తానికి ధోనీ దూరంగా ఉన్నాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే చెన్నైలో జరిగిన ముందస్తు శిక్షణా శిబిరంలో ధోనీ తీవ్రమైన పిక్క కండరాల గాయానికి గురయ్యాడు. మొదట్లో ఈ గాయం నుంచి కోలుకోవడానికి కేవలం రెండు వారాల సమయం పడుతుందని భావించినప్పటికీ, వయసు రీత్యా కోలుకునే ప్రక్రియ ఆలస్యం అయిందని చెబుతున్నారు. టోర్నీ మధ్యలో ఆయన కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తూ బొటనవేలికి మరో గాయం కావడంతో ఆయన పునరాగమనం పూర్తిగా అసాధ్యంగా మారింది. సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే ధోనీ జట్టుతో చేరుతారని బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ చెప్పారు. అయితే, తాజా ఓటమితో ధోనీకి ఇక ఈ సీజన్ లో అవకాశం లేకుండా పోయింది. వచ్చే సీజన్ పైన ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ధోనీకి ఐపీఎల్ ఆదాయం
అయితే, ధోనీ ఒక్క మ్యాచ్ ఆడకపోయినా వచ్చే ఫీజు పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. మైదానంలో అడుగుపెట్టకపోయినా ధోనీకి సీఎస్‌కే యాజమాన్యం రూ. 4 కోట్ల పూర్తి వేతనాన్ని చెల్లించనుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు దాటిన భారతీయ ఆటగాళ్లను తక్కువ ధరకే జట్టులో ఉంచుకునే 'అన్‌క్యాప్డ్ ప్లేయర్' నిబంధన కింద సీఎస్‌కే ధోనీని రూ. 4 కోట్లకు అట్టి పెట్టుకుంది. ఇది ఒక స్థిరమైన ఒప్పందం కావడం వల్ల, ఆటగాడు ఎన్ని మ్యాచ్‌లు ఆడాడనే దానితో సంబంధం లేకుండా పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రతి మ్యాచ్‌కు లభించే రూ. 7.5 లక్షల మ్యాచ్ ఫీజును మాత్రం ధోనీ కోల్పోనున్నారు. అంతేకాకుండా, ఐపీఎల్ ఆటగాళ్లకు ఉండే పూర్తి బీమా సౌకర్యం కారణంగా, గాయం వల్ల మ్యాచ్‌లకు దూరమైతే ఆ ఆర్థిక భారాన్ని బీమా సంస్థే భరిస్తుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభంలో రూ. 6 కోట్ల ధరతో ప్రయాణాన్ని మొదలుపెట్టిన ధోనీ, ఒకానొక దశలో ఏడాదికి రూ. 15 కోట్ల వరకు అందుకున్నారు.













Click it and Unblock the Notifications