కోచ్ సాబ్.. మీ నవ్వు కిల్లర్ కాంబినేషన్!

టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసి భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అపురూప విజయంపై సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందిస్తూ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

గంభీర్ నవ్వుపై ధోనీ క్రేజీ కామెంట్
ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనీ తనదైన శైలిలో స్పందిస్తూ.. "అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించబడింది. భారత క్రికెట్ జట్టుకు, సపోర్ట్ స్టాఫ్‌కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు హృదయపూర్వక అభినందనలు. మీ ఆటను చూడటం చాలా ఆనందంగా ఉంది. 'కోచ్ సాబ్'.. మీ ముఖంపై నవ్వు చాలా బాగుంది. తీవ్రత, చిరునవ్వు.. ఈ రెండింటి కలయిక కిల్లర్ కాంబినేషన్! చాలా బాగా చేశారు, ఎంజాయ్ చేయండి గైస్!" అని పేర్కొన్నారు. అలాగే జస్‌ప్రీత్ బుమ్రా గురించి రాస్తూ, "బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అతను ఒక ఛాంపియన్ బౌలర్" అని కొనియాడారు.

MS Dhoni Viral Post Praises Coach Gautam Gambhir Smile After T20 World Cup 2026 Victory

విమర్శలకు గంభీర్ ఘాటు సమాధానం
ధోనీ ప్రశంసల మధ్య, కోచ్ గౌతమ్ గంభీర్ విజయం అనంతరం మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో జరిగే అనవసర చర్చలపై స్పందిస్తూ.. "సోషల్ మీడియాలో విమర్శించే వారి పట్ల నాకు ఎటువంటి జవాబుదారీతనం లేదు. నా బాధ్యత అంతా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆ 30 మంది ఆటగాళ్లు, సిబ్బంది పట్ల మాత్రమే. ఒక కోచ్ తన జట్టు ఎంత బాగుంటే అంత గొప్పగా ఉంటాడు. నన్ను ఒక కోచ్‌గా తీర్చిదిద్దినది ఈ ఆటగాళ్లే" అని గంభీర్ తేల్చి చెప్పారు.

దిగ్గజాలకు అంకితం
ఈ విజయం తనదని చెప్పుకోకుండా భారత క్రికెట్ భవిష్యత్తు కోసం పనిచేసిన వారిని గంభీర్ గుర్తుచేసుకున్నారు. "ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నాను. జట్టును ఒక స్థాయికి తీసుకెళ్లినందుకు రాహుల్ భాయ్‌కి, ఎన్‌సీఏ (CoE) ద్వారా బలమైన బెంచ్ స్ట్రెంత్‌ను సిద్ధం చేసినందుకు లక్ష్మణ్‌కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని ఆయన పేర్కొన్నారు. అలాగే, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఐసీసీ ఛైర్మన్ జై షాకు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు కూడా గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+