వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో: టీమిండియా మాజీ ప్లేయర్ లేవనెత్తిన ప్రశ్నలు
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో పునరాగమనం చేసిన వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్ట్ హ్యాండర్ నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సాధారణంగా ఓపెనర్ గా ఆడే వైభవ్.. వన్ డౌన్ గా క్రీజ్ లో దిగడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా.. ఆడే సామర్థ్యం ఇంకా అలవర్చుకోలేదని, ఈ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మూడో స్థానంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ దిగడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ తప్పుపట్టాడు. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు ప్రశ్నలు సంధించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మురళీ కార్తీక్ జట్టు వ్యూహాల గురించి మాట్లాడారు. ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా మాత్రమే ఆడాడని, ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా ఆడేంత అనుభవం అతనికి లేదని గుర్తు చేశాడు.

వైభవ్ ఏ స్థానంలో రాణించగలడో టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉందని మురళీ కార్తీక్ వ్యాఖ్యానించాడు. అతను ఓపెనర్‌గా మాత్రమే అద్భుతంగా ఆడగలడని, టాప్/ మిడిల్ ఆర్డర్‌లో ఆడిన అనుభవం అతనికి లేదని పేర్కొన్నాడు. 15 సంవత్సరాలు ఉన్న ఓ ప్లేయర్ కు ఒకే శైలిలో ఆడటం తెలుసని, బ్యాటింగ్ ఆర్డర్, సందర్భానికి తగ్గట్టుగా ఆడే అనుభవం ఉండదని వ్యాఖ్యానించాడు. అందుకే సీనియర్ ఆటగాళ్లు ఆ పాత్రలు పోషించేలా జట్టు ప్లానింగ్ ఉండాలని చెప్పాడు.
జట్టులో సంజూ శాంసన్ వంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్ ఉన్నప్పుడు, అతన్ని ఇలా వేర్వేరు స్థానాల్లో క్రీజ్ లో దించవచ్చని, వైభవ్ సూర్యవంశీ విషయంలో అలాంటి నిర్ణయాలను తీసుకోలేమనీ అన్నాడు. తుదిజట్టులోకి వైభవ్ ను తీసుకున్నప్పుడు అతను ఎప్పుడూ ఆడే ఓపెనర్ గానే పంపించి ఉంటే బాగుంటుందని, సీనియర్లు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు తీసుకోవాల్సిందని అన్నారు. ఒకవేళ మిడిల్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేయించాలనే ఆలోచన ఉంటే వైభవ్‌కు బదులుగా శివమ్ దూబెను జట్టులోకి తీసుకుని ఉంటే సమీకరణాలు వేరుగా ఉండేవని కార్తీక్ స్పష్టం చేశాడు.













Click it and Unblock the Notifications
