రూ.11 కోట్లు పెట్టి మ్యాచ్ ఫిక్సర్‌ని కొన్నావా..?
అంతన్నారు..ఇంతన్నారు.. ముంత మామిడి పండున్నారు.. ఈ సమేత సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు అచ్చి గుద్దినట్టు సరిపోతుంది. టోర్నీకి ముందు ఎన్ని గొప్పలు చెప్పారంటే.. ఇక కప్ తీసుకోవడమే తరువాయి అన్నట్టుగా చెప్పారు.కాటేరమ్మ కొడుకులంటూ అభిమానులు కూడా తెగ హంగామా సృష్టించారు. గ్రౌండ్‌లో దిగితే కానీ మనోళ్ల ఆట బయటపడలేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతానికి భిన్నంగా చాలామంది అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలిచారు. క్రికెట్ అభిమానులు సైతం ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అందరి అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్‌ను ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. అయితే ఇదే జోరును సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించలేకపోయింది. వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైయెస్ట్ స్కోర్‌ను ఛేజింగ్ చేసి ఫ్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి, ఫ్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.

అయితే బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓపెనర్ హెడ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. దీపక్ చాహర్ వేసిన ఓవర్‌లో బాల్ బ్యాట్‌కు తాకకుండానే అతను అవుట్ అయ్యాడు. అటు బౌలర్ కానీ, ఇటు కీపర్ కానీ ఎవరూ కూడా అపీల్ చేయలేదు.పైగా అంపైర్ ఆ బాల్‌ను వైడ్ ఇవ్వడానికి సన్నద్దం అవుతున్న సమయంలో ఇషాన్ కిషన్ క్రీజు వదిలి వెళ్లిపోయాడు. దీంతో ముంబై ఆటగాళ్లు అపీల్ చేయడంతో, చేసేది లేక అంపైర్ సైతం ఇషాన్ కిషన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. బాల్ బ్యాట్‌కు తాకకుండానే ఇషాన్ కిషన్ క్రీజు వదలడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బంతి బ్యాట్‌కు తాకిందో లేదో తెలుసుకోవడానికి రివ్యూ అవకాశం ఉండి కూడా ఇషాన్ కిషన్ ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఇషాన్ కిషన్ గతంలో ముంబై ఇండియాన్స్ తరఫున ఆడాడని, దీంతో వారికి అమ్ముడుపోయాడంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఇషాన్ కిషన్ ఈ సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే రాణించాడు. సన్ రైజర్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్, ఆ తర్వాత తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు. రూ 11.75 కోట్లు చెల్లించి ఇషాన్ కిషన్ జట్టులోకి తీసుకుంది కావ్య మారన్. అతను కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే రాణించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో అసలు తనకు బ్యాటింగ్ వచ్చా అన్న విధంగా ఆడాడు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications