కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!
టీ20 ప్రపంచకప్ లో గెలిచి భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్ లో ఏకపక్షంగా విజయం నమోదు చేసి కప్ సొంతం చేసుకుంది. అన్ని రంగాల్లోనూ ఆశించిన స్థాయి కంటే భారత్ ప్లేయర్లు మెరుగ్గా రాణించారు. సమిష్టిగా విజయం సాధించి కోట్లాది అభిమానులకు ఆనందాన్ని పంచారు. ఈ సమయంలోనే భారత్ మూలాలు ఉన్న కివీస్ ఆటగాడు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కివీస్ ఓడినందుకు కాదు.. భారత్ టీంలో సభ్యుడిగా కాక పోయినందకు .. జాతీయ గీతం వేళ ఆ వైబ్రేషన్స్ కన్నీరుగా మారాయి.
టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. కివీస్ బౌలర్లు.. బ్యాటర్లను ఇండియన్ ప్లేయర్లు చుక్కలు చూపించారు. స్టేడియంలో 1.20 లక్షల మంది అభిమానులు.. టీవీల ముందు కోట్లాది ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అతిరథమహారథులు స్టేడియంకు తరలి వచ్చారు. ఈ సమయంలో మ్యాచ్ కు ముందు కివీస్ - భారత్ జాతీయ గీతాలను ఆలపించారు. ఒక్క సారిగా లక్షా 20 వేల మంది జాతీయ గీతం ఆలపించే వేళ స్టేడియం లో ఒక్కటిగా వచ్చిన ఆ స్వరం కొత్త వైబ్రేషన్స్ కు కారణమైంది.

అదే సమయంలో యావత్ భారత్ ఒక్కటిగా నిలిచి టీమిండియాకు మద్దతుగా నిలిచింది. అయితే.. ఇదే సమయంలో కివీస్ ప్లేయర్ ఇష్ సోథీ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ మొత్తం సోథీ డగౌట్ కే పరిమితం అయ్యాడు. అయితే, సోథీ అసలు ఎందుకు కన్నీరు పెట్టుకున్నారనేది ఆసక్తి కరంగా మారింది. దీని పైన కివీస్ మద్దతు దారులు ఆసక్తి కర పోస్టులు చేసారు.
భారతీయ మూలాలు .. భారత్ పై అభిమానం
33 సంవత్సరాల ఇష్ సోథీ భారత్ మూలాలు ఉన్న కివీస్ ఆటగాడు. లూథియానా ప్రాంతానికి చెందిన సోథీ కివీస్ కు చాలా కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. న్యూజీలాండ్ జట్టులో స్పెషల్ బౌలర్ గా ఉన్నాడు. ఫైనల్ వేళ అంత మంది సమక్షంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయం లో ఒక్క సారిగా సోథీ ఎమోషనల్ అయ్యాడు. తాను భారత్ లో ఆడే అవకాశం దక్కలేదనే ఆవేదన ఆ కన్నీటి వెనుక ఉందనే పోస్టులు కనిపిస్తున్నాయి.
Ish Sodhi crying during the New Zealand national anthem
— Shah (@Shahhoon1) March 8, 2026
pic.twitter.com/MI0Le5LiHl
సోథీ రక్తం లో భారతీయం ఉందని.. తన సొంత దేశం తరపున ఆడే అవకాశం రాలేదనే ఆ సమయంలో సోథీ ఎమోషనల్ అవ్వటానికి కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే.. భారత్ లో క్రికెట్ ఉన్న ఆదరణ.. ఆటగాళ్ల పైన చూపించే అభిమానం తమకు ఉండాలని ప్రతీ క్రికెట్ ప్లేయర్ కోరుకుంటారు. అహ్మదాబాద్ స్టేడియం లో లక్షా 20 వేల మంది సమక్షంలో భారత్ కు లభిస్తున్న మద్దతు చూసి ఆ వైబ్రేషన్స్ ఎమోషనల్ గా మారి.. సోథీ కంట కన్నీరుగా బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications