నితీష్ కుమార్ రెడ్డి అవుట్
భారత్ తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఆడుతోంది. 30 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మాట్ రెన్ షా, అలెక్స్ క్యారీ క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ కమ్ కేప్టెన్ మిఛెల్ మార్ష్- 41, టాప్ ఆర్డర్ బ్యాటర్లు మాథ్యూ షార్ట్- 30, ట్రావిస్ హెడ్- 29 పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది ఆస్ట్రేలియా. వన్డే ఇంటర్నేషనల్స్ లో టాస్ ఓడిపోవడంలో రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు వరుసగా 18 వన్డేల్లో టాస్ గెలవలేదు. ప్రతీసారీ ప్రత్యర్థిదే పైచేయి అయింది. బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్ దూకుడుగా ఆడారు. ఓవర్ కు ఆరు చొప్పున పరుగులను రాబట్టుకున్నారు. ఈ క్రమంలో క్రీజ్ లో పాతుకుపోయిన ఓపెనింగ్ జోడీ మహ్మద్ సిరాజ్ విడగొట్టాడు.

పదో ఓవర్ రెండో బంతికి ట్రావిస్ హెడ్ ను అవుట్ చేశాడు సిరాజ్. ఆఫ్ స్టంప్స్ కు కాస్త దూరంగా వేసిన లెంగ్త్ డెలివరీని షాట్ ఆడాడు హెడ్. బ్యాక్ వర్డ్ పాయింట్ మీదుగా గాల్లోకి లేచిన ఆ బంగిని ప్రసిద్ధ్ అందుకున్నాడు. దీంతో 61 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.. ఆసీస్. మాథ్యూ షార్ట్ తో కలిసి మార్ష్ భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.
మూడు మ్యాచ్ ఈ సిరీస్ లో తొలి రెండింట్లోనూ ఓడిపోయింది టీమిండియా. సిరీస్ ను ఆస్ట్రేలియాకు ధారదాత్తం చేసింది. మూడో వన్డేలో కూడా అదే పరిస్థితి తలెత్తితే.. 3-0తో సిరీస్ ను కోల్పోవాల్సి ఉంటుంది. ఈ క్లీన్ స్వీప్ ను తప్పించుకోవడానికి పోరాడుతోంది. వైట్ వాష్ నుంచి తప్పించుకోవడానికి గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడం వల్ల రెండు మార్పులు చేసింది. అర్ష్ దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. వారి స్థానంలో కుల్ దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు.
గాయం కారణంగా నితీష్ కుమార్ రెడ్డి తప్పుకోవాల్సి వచ్చింది. అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. అతని ఎడమ క్వాడ్రిసెప్స్‌కు గాయం అయింది. దీంతో అతను మూడో వన్డేకు అందుబాటులో లేడు. బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. అర్ష్‌దీప్ గురించి బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, అతను కూడా 100 శాతం ఫిట్ నెస్ తో లేడనే అంచనాలు ఉన్నాయి. అడిలైడ్ మ్యాచ్ అతను కండరాల నొప్పితో బాధపడ్డాడు.












Click it and Unblock the Notifications