Olympics: కాంస్య పతకం సాధించిన హాకీ జట్టు సభ్యులకు ప్రధాని మోడీ ఫోన్
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించింది భారత హాకీ జట్టు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇక, మ్యాచ్ ముగిసిన తర్వాత భారత హాకీ జట్టు గెలుపు సంబరాలను చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సహా పలువురు రాజకీయ నేతలు హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

2024 పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని సాధించినందుకు హాకీ టీమ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మాట్లాడారు. వారికి అభినందనలు తెలిపారు. 'తరాలపాటు నిలిచిపోయే ప్రతిష్ఠాత్మక విజయం ఇది. వరుసగా రెండో ఒలింపిక్స్ పతకం సాధించడం మరింత ప్రత్యేకం. నైపుణ్యం, పట్టుదల, బృంద స్ఫూర్తి భారత విజయానికి కారణం. ప్రతి భారతీయుడు హాకీతో భావోద్వేగ అనుబంధం కలిగి ఉంటాడు. ఈ గెలుపు మన యువతలో హాకీని మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది" అంటూ ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
'ఐదు దశాబ్దాల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించింది. భారత హాకీ పునరుజ్జీవానికి ఈ టీమ్ చేసిన కృషి ప్రశంసనీయం. నిలకడ, నైపుణ్యం, సమన్వయం, పోరాటం ద్వారా క్రీడాకారులు చూపిన ప్రదర్శన యువతకు స్ఫూర్తిదాయకం' అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. మరోవైపు, 'విశేషమైన టీమ్ వర్క్, అద్భుతమైన నైపుణ్యాలు, గొప్ప విజయాన్ని కట్టబెట్టాయి' అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
#WATCH | PM Narendra Modi spoke to the Indian Hockey team and congratulated them on the #Bronze medal victory. #OlympicGames #Paris2024 pic.twitter.com/OuuaEHVj0y
— ANI (@ANI) August 8, 2024
'జట్టు ప్రదర్శన, క్రీడాస్ఫూర్తి క్రీడల పట్ల కొత్త అభిరుచిని రేకెత్తిస్తున్నాయి. మీ విజయం గర్వకారణం' అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కాంస్య పతకం గెలిచిన హాకీ జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 'అంకితభావం, అచంచలమైన కృషితో భారత జట్టు సాధించిన అసాధారణ విజయం పట్ల దేశం గర్విస్తోంది' అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.












Click it and Unblock the Notifications