PAK vs SL: సెమీస్ డిసైడర్ మ్యాచ్ వేళ పాక్ కు బిగ్ షాక్..!!
T20 World cup Pak vs SL: పాక్ కు చివరి అవకాశం. న్యూజీలాండ్ ను ఓడించి ఇంగ్లాండ్ ఇచ్చిన అవకాశం పాక్ అందిపుచ్చుకుంటుందా అనేదే ఇప్పుడు కీలకం. సూపర్ -8లో భాగంగా ఇవాళ(శనివారం) మరో కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర ఫైట్ ప్రారంభం కానుంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు చావోరేవో లాంటింది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీ ఫైనల్‌కు వెళ్తుంది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందే పాక్ కు భారీ షాకింగ్ న్యూస్ అందుతోంది. దీంతో.. టీంలో టెన్షన్ మొదలైంది.
టీ20 ప్రపంచ కప్ లో ఈ రోజు మరో ఆసక్తి కర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో పాక్ గెలవటం కాదు.. అంతకు మించి అన్నట్లుగా ఆట తీరు ప్రదర్శిస్తేనే సెమీస్ కు చేరుతుంది. లేకపోతే... న్యూజీలాండ్ కు రూట్ క్లియర్ అవుతుంది. ఈ మ్యాచ్ లో పాక్ ఒకవేళ ఓడినా, మాములు విజయం సాధించినా... ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక దారిలోనే పాకిస్థాన్ పయనం ఉంటుంది. ఇలాంటి కీలకమైన మ్యాచ్ వేళ.. పాకిస్థాన్ అభిమానులను వరుణుడు భయపెడు తున్నాడు. మ్యాచ్ జరిగే పల్లెకెలె ప్రాంతంలో వాతావరణం మారుతోంది. కొద్ది రోజులుగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కీలక మ్యాచ్ వేళ వర్షం ముప్పు ఉందని తాజా రిపోర్టులు పాక్ టీం ను భయ పెడుతున్నాయి. సూపర్-8లో న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఆగిపోయింది. ఇదే గ్రూప్-2లోని సెమీస్ బెర్తుపై ప్రభావం చూపింది.

భారీ విజయం నమోదు చేస్తేనే సెమీస్ కు ఛాన్స్
ఇక, ఇవాళ జరిగే శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ ఫలితంతో సెమీ ఫైనల్‌కు చేరే జట్టు ఏదో తేలనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు వాన ముప్పు తక్కువగానే ఉందని చెబుతున్నా.. మారుతున్న వాతవరణం మాత్రం ఆందోళన పెంచుతోంది. పల్లెకెలెలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో 30 నుంచి 40 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే... న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు వెళ్తుంది. మరోవైపు శ్రీలంక జట్టు తమ సొంత గడ్డపై ఆడుతుండటం పాకిస్థాన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. పల్లెకెలె పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందా లేదా బ్యాటర్లకు సహకరిస్తుందా అనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. వర్షం పడినా పాక్ కు ఒక పాయింల్ లభిస్తుంది. అటు న్యూజీలాండ్ మూడు పాయింట్లతో ఉండంతో సెమీస్ రూటు క్లియర్ అవుతుంది. దీంతో.. పాక్ టీం ఈ మ్యాచ్ వేళ టాస్.. పిచ్ .. టార్గెట్ తో పాటుగా వర్షం ప్రభావం సెమీస్ రూటు డిసైడ్ చేయనుంది.












Click it and Unblock the Notifications