Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pakistan: భారత్ చేతిలో ఓటమితో పాక్ బోర్డు అర్ధరాత్రి సంచలనం-ఇద్దరికి షాక్..!

టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026)లో భాగంగా కొలంబోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ (Pakistan) ఘోర పరాజయం పాలైంది. భారత్ విసిరిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 112 పరుగులకే చతికిల పడింది. కీలక ఆటగాళ్లు విఫలం కావడం, విజృంభిస్తారని లెక్కలేసుకున్న స్పిన్నర్లు హ్యాండ్ ఇవ్వడంతో చేసేది లేక పాకిస్తాన్ చేతులెత్తేసింది. దీంతో మరోసారి వరల్డ్ కప్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ కు దారుణ పరాభవం తప్పలేదు. దీని ఎఫెక్ట్ మ్యాచ్ జరుగుతుండగానే మొదలైంది.

భారత్ తో మ్యాచ్ లో ఓటమి తప్పదని తేలిపోవడంతో మధ్యలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్, మంత్రి కూడా అయిన మొహసిన్ నక్వీ స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఓటమి పాలు కాగానే స్వదేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. జనం టీవీలు పగులగొడుతున్న దృశ్యాలు, సోషల్ మిడియాలో తమ క్రికెటర్లను నానా తిట్లూ తిడుతున్న ట్వీట్లు, టీవీల్లో మాజీ క్రికెటర్లు ప్రస్తుత టీమ్ లో విఫలమైన ఆటగాళ్లతో పాటు పీసీబీ ఛీఫ్ పైనా దుమ్మెత్తి పోస్తున్న వీడియోలు ఇవాళ హల్ చల్ చేశాయి.

Pakistan Cricket Board Makes Major Player Changes in Sudden Move After World Cup Loss to India

ఈ నేపథ్యంలో మరో కీలక విషయం బయటికి వచ్చింది. నిన్న భారత్ చేతిలో దారుణ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు షాక్ లో ఉన్నారని ఆ జట్టు కోచ్ హెస్సెన్ వెల్లడించాడు. ఆ తర్వాత వారికి అర్ధరాత్రి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరో షాకిచ్చింది. ఈ మ్యాచ్ లో పేలవ ఆటతీరుతో భారత్ కు మ్యాచ్ అప్పగించిన ఇద్దరు సీనియర్ క్రికెటర్లు బాబర్ ఆజం, షహీన్ షా అఫ్రిదిని తర్వాత మ్యాచ్ నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో నమీబియాతో మ్యాచ్ కు వీరి స్ధానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్ షా, ఫకర్ జమాన్, ఖవాజాల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+