హైదరాబాద్‌లో దిగిన పాకిస్తాన్ జట్టు: ఉప్పల్ స్టేడియంలో..
ఇస్లామాబాద్: ఈ ఏడాది ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ముందు బిగ్గెస్ట్ టాస్క్. ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో ఆడాల్సి ఉంది. అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది.
ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. దీని తరువాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లతో తలపడుతుంది.

నెదర్లాండ్స్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్.. లీగ్ దశలో చిట్ట చివరిది. నవంబర్ 12వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆ తరువాత నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ కూడా నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
ఈ మెగా టోర్నీలో ఆడటానికి పాకిస్తాన్ జట్టు.. భారత్‌కు చేరుకుంది. ఏడు సంవత్సరాల విరామం అనంతరం పాక్ జాతీయ జట్టు భారత్‌లో అడుగు పెట్టింది. హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, ఇటు బీసీసీఐ.. ద్వైపాక్షిక సిరస్‌లను నిర్వహించట్లేదు. ఐసీసీ లేదా ఏసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.

ఐసీసీ వరల్డ్ కప్ ఆడటానికి పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చింది. 25వ తేదీన పాక్ నుంచి బయలుదేరిన ఆ జట్టు తొలుత దుబాయ్‌కు వెళ్లింది. అక్కడి నుంచి భారత్‌కు చేరుకుంది. దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది కేప్టెన్ బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు.

అక్టోబర్ 6వ తేదీన తన తొలి మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్. నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 10వ తేదీన శ్రీలంక, 14వ తేదీన భారత్‌తో పాకిస్తాన్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఆసియా కప్ 2023లో సూపర్ 4 దశలోనే వెనుదిరిగిన నేపథ్యంలో బాబర్ ఆజమ్ జట్టు వరల్డ్ కప్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.
హైదరాబాద్‌లో దిగిన పాకిస్తాన్ జట్టు: ఉప్పల్ స్టేడియంలో..#WorldCup2023 , #Pakistan pic.twitter.com/7u6GNKQ3Li
— oneindiatelugu (@oneindiatelugu) September 27, 2023












Click it and Unblock the Notifications