భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి కప్పును ముద్దాడింది. ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ అయిదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు.
టీమిండియా విజయం ఈ విజయం పాకిస్థానీ క్రికెటర్లకు మింగుడుపడట్లేదు. ముఖ్యంగా మహ్మద్ ఆమీర్, షోయబ్ అఖ్తర్.. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపుమంటను ప్రదర్శించారు. భారత్ గెలుపుపై సెటైరికల్ గా స్పందించారు. తమ అక్కసును తీర్చుకునే ప్రయత్నం చేశారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ టీవీ షోలో మాట్లాడాడు మహ్మద్ అమీర్. ఫైనల్స్ లో భారత్ సాధించిన విజయంపై యాంకర్ ప్రస్తావించాడు. ఎలా భావిస్తున్నారని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న అహ్మద్ అమీర్ ను ఇబ్బందులకు గురి చేసినట్టయింది. తిన్నగా సమాధానం ఇవ్వలేదు. విసుగును ప్రదర్శించాడు. "భారత ప్లేయర్లు గెలిచారు. అయితే ఏంటీ. సరేలే, కప్పును వాళ్ల ఇంటికే తీసుకెళ్తారు, నా ఇంటికి కాదు. వెల్ ప్లేయ్డ్..అని" వ్యంగ్యంగా బదులిచ్చాడు. న్యూజిలాండ్ కేప్టెన్ మిఛెల్ సాంట్నర్.. కప్ ను బంగారు పళ్లెంలో పెట్టి భారత్ కు ఇచ్చాడని ఎద్దేవా చేశాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్, అంతకుముందు సెమీఫైనల్‌లో భారత్ ఓడిపోతుందని ఆమిర్ అనేకసార్లు అంచనా వేశాడు. దీంతో అతనిపై భారత్ లో విమర్శలు వ్యక్తం అయ్యాయి. అతన్ని నకిలీ బాబా, ఢోంగీ బాబా, తుక్కా మ్యాన్, దొంగ నొస్ట్రాడమస్ తప్పుడు జోస్యం చెప్పాడంటూ భారత నెటిజన్లు చెలరేగారు. అతని అంచనాలపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం మండిపడ్డాడు. దొంగ బాబాగా అభివర్ణించాడు.
భారత్ గెలిచిన తర్వాత ఆమిర్ తన మాట మార్చాడు. ఫైనల్ చేరివుంటే ఇంగ్లాండే విజయం సాధించేదని, సెమీ ఫైనల్స్ లో సంజు శాంసన్ క్యాచ్‌ను హ్యారీ బ్రూక్ వదిలేయడం వల్ల మ్యాచ్ చేజారిందని పేర్కొన్నాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే భారత్ భారీ స్కోర్ చేసేది కాదని, దాన్ని ఇంగ్లాండ్ అందుకుని ఉండేదని అన్నాడు.
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా వివాదాస్పదంగా స్పందించాడు. భారత్ ఎదుగుదల క్రికెట్‌ను సర్వనాశనం చేసిందని పేర్కొన్నాడు. భారత్‌ను ఓ ధనిక పిల్లవాడితో పోల్చాడు. ఫైనల్ మ్యాచ్ ఓ కాలనీలో జరిగినట్టు ఉందని, లోకల్ గా ఆడే ధనవంతుల పిల్లలు ఆధిపత్యం చెలాయించినట్లుగా ఉందని వ్యాఖ్యానించాడు.
ఓ కాలనీలో ఉండే ధనిక పిల్లవాడు, పేద పిల్లలతో కలిసి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో భారత్, పాకిస్తాన్ తో సరిగ్గా అలానే చేస్తోందని అఖ్తర్ అన్నాడు. భారత జట్టు క్రికెట్‌ను సమూలంగా నాశనం చేసిందని చురకలు అంటించాడు. మ్యాచ్ రీత్యా భారత్‌ను ఫేవరెట్‌గా అంగీకరించినప్పటికీ, క్రికెట్ ప్రయోజనాల కోసం న్యూజిలాండ్ టైటిల్ గెలవాలని కోరుకున్నానని పేర్కొన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసించాడు అఖ్తర్. కష్టకాలంలో ఆటగాళ్లకు మద్దతు ఇచ్చాడని, సరైన దిశానిర్దేశం చేశాడని అన్నాడు. జట్టు ప్లేయర్లు- హెడ్ కోచ్ మధ్య మంచి అవగాహన, విశ్వాసం ఉందని అదే వారిని విజయం వైపు నడిపించిందని చెప్పుకొచ్చాడు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications