సెమీస్ సీన్ అంతా తలకిందులు- పాకిస్తాన్ కు రెడ్ కార్పెట్ పరిచిన ఇంగ్లాండ్

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో ఉత్కంఠతను రేపిన మ్యాచ్.. ఇంగ్లండ్-న్యూజిలాండ్. పాకిస్తాన్ తలరాతను డిసైడ్ చేయాల్సిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సీన్ మొత్తం తలకిందులైంది. సెమీఫైనల్ రేసులో పాకిస్తాన్ తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ అనూహ్య ఫలితం గ్రూప్ 2 సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. నేడు పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో పాకిస్తాన్ ఆడనున్న మ్యాచ్ కీలకం.

గ్రూప్-2 నుంచి సెమీఫైనల్‌కు ఎవరు చేరుకుంటారనేది ఈ మ్యాచ్ తో తేలిపోతుంది. పాకిస్తాన్ భారీ తేడాతో గెలిచి, న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్‌ను అధిగమిస్తేనే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. న్యూజిలాండ్ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగుతుంది. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తే శ్రీలంకను కనీసం 64 పరుగుల తేడాతో ఓడించాలి. లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 13.1 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించడం తప్పనిసరి అయిందా టీమ్ కు. ఈ రెండింట్లో ఏది జరక్కపోయినా న్యూజిలాండ్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.

Pakistan semifinal dream alive as England beat New Zealand slump race for last 4 tightens in Super 8

నెట్ రన్‌రేట్ ఆధారంగానే ఈ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ నెట్ రన్‌రేట్ -0.461 కాగా, న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్ 1.390 ఉంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 3, పాకిస్తాన్ ఒక పాయింట్‌తో ఉన్నాయి. పాకిస్తాన్‌కు ఇది డూ ఆర్ డై అనే పరిస్థితి. ఒకవేళ మ్యాచ్ రద్దయినా న్యూజిలాండే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఇంగ్లాండ్ పై ఓటమితో కివీస్ భవితవ్యం.. ఈ మ్యాచ్ ఫలితంపై ఆధారపడింది.

ఇంగ్లాండ్ ఇప్పటికే 6 పాయింట్లతో గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. గ్రూప్ 2 సమీకరణాల ప్రకారం న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధిస్తే, మొదటి సెమీఫైనల్ మార్చి 4న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. రెండో సెమీఫైనల్ మాత్రం మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉంటుంది. సెమీ ఫైనల్స్ లో ఎవరు ఎవరితో తలపడతారనేది తేలడానికి భారత్- వెస్టిండీస్ మ్యాచ్ కూడా ముగియాలి.

కాగా- ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో ఒకానొక దశలో పటిష్టస్థితిలో కనిపించింది. ఇంగ్లాండ్ 16.5 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 117 పరుగుల వద్ద ఉన్నప్పుడు రేహాన్ అహ్మద్ (19 నాటౌట్), విల్ జాక్స్ (32 నాటౌట్) తడాఖా చూపారు. వారు అందించిన 44 పరుగుల కీలక భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+