పాకిస్తాన్ ప్లేయర్లకు బిగ్ షాక్: బోల్డ్ డెసిషన్
ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత ట్రోఫీ ప్రదానం విషయంలో నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ట్రోఫీని భారత్ కు అందించే విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ చేసిన తాజా సూచనలను కూడా ఆయన పెడచెవిన పెట్టారు. ట్రోఫీని భారత జట్టుకు నేరుగా ఇవ్వడానికి నిరాకరించారు. బీసీసీఐకి ఘాటుగా బదులిచ్చారు.
ఈ పరిస్థితుల మధ్య పీసీబీ మరో నిర్ణయాన్ని తీసుకుంది. విదేశీ టీ20 లీగ్‌లలో ఆడాలనుకునే తమ ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. ఫైనల్ సహా ఆసియా కప్ టోర్నమెంట్ లో మొత్తం మూడుసార్లు భారత్ చేతిలో పాకిస్తాన్ పరాజయం పాలైన నేపథ్యంలో పీసీబీ ఈ షాక్ ఇచ్చింది. తమ దేశ క్రికెటర్లు విదేశీ టీ20 లీగ్‌లలో ఆడకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో కఠిన చర్యలు చేపట్టింది.

పాకిస్థాన్ వెలుపల జరిగే ఫ్రాంఛైజ్ లీగ్‌లలో పాల్గొనాలనుకునే ఆటగాళ్లెవరికీ కూడా ఎన్ఓసీలు మంజూరు చేయబోమని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ అయిన ఎన్ఓసీలను కూడా రద్దు చేసింది. ఈ మేరకు పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్ ఓ నోటిఫికేషన్ ఇచ్చారు. విదేశీ లీగ్‌లు, టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి ఇచ్చిన అన్ని ఎన్ఓసీలు కూడా తక్షణమే రద్దయినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమలులో ఉంటుంది.
బాబర్ ఆజమ్, షహీన్ షా అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్, ఫహీమ్ అష్రఫ్, సయీం అయూబ్ వంటి టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్లను ఈ నిర్ణయం ప్రభావితం చేస్తుందేనే అభిప్రాయాలు ఉన్నాయి. వీరంతా బిగ్ బాష్ లీగ్, ఐఎల్టీ20 వంటి లీగ్‌లలో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. వాటి ఫ్రాంఛైజీలు నిర్వహించే ఆక్షన్ లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. వారందరికీ ఎన్ఓసీలను నిలిపివేసినట్టయింది. మెగా ఆక్షన్ లల్లో వాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకోరు. విదేశీ టోర్నమెంట్లల్లో ఆడాలనే ప్లేయర్ల కలలు కల్లలైనట్టే.
ప్లేయర్ల పెర్ఫార్మెన్స్ ఆధారంగా మాత్రమే ఎన్ఓసీలను జారీ చేయాలని పీసీబీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఎన్ఓసీ గైడ్ లైన్స్ గానీ, దాని కాల పరిమితి గానీ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఎన్ఓసీని రద్దు చేస్తే.. ప్లేయర్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ పై దృష్టి సారిస్తారని అభిప్రాయపడుతోంది.
-
ఇరాన్ వార్ లోకి రెండు గల్ఫ్ దేశాలు? ట్రంప్ వైఫల్యం వేళ బిగ్ ట్విస్ట్..! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications