ప్రాణాలతో ఉండాలంటే ఐపీఎల్ ఆడుకోండి..!
PSL 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్ 11వ సీజన్ ప్రారంభానికి ముందే తీవ్ర భద్రతా ఆందోళనల్లో చిక్కుకుంది. మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీపై ఉగ్రవాద నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే దేశంలో చమురు సంక్షోభం, విదేశీ ఆటగాళ్ల గైర్హాజరీతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఉగ్రవాద ముఠ హెచ్చరికలు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి.
విదేశీ ఆటగాళ్లే లక్ష్యంగా హెచ్చరికలు
తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) అనుబంధ సంస్థ 'జమాత్-ఉల్-అహ్రార్' తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. లాహోర్, కరాచీ నగరాల్లో జరగబోయే పీఎస్ఎల్ మ్యాచ్‌ల నుంచి విదేశీ ఆటగాళ్లు వెంటనే తప్పుకోవాలని.. లేదంటే ప్రమాదం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని.. అంతర్జాతీయ ప్లేయర్ల భద్రతకు తాము గ్యారెంటీ ఇవ్వలేమని ఆ సంస్థ పేర్కొంది. దేశంలోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో హింస, సైనిక చర్యల వల్ల ప్రజలు అల్లాడుతుంటే.. ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం గాయాలపై కారం చల్లడమేనని ఉగ్రవాద సంస్థ పేర్కొంది.

పీసీబీ సంచలన నిర్ణయం
ఈ బెదిరింపుల నేపథ్యంలో పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇప్పటికే కీలక నిర్ణయాలను ప్రకటించారు. గతంలో ఆరు నగరాల్లో జరిగిన మ్యాచ్‌లను ఇప్పుడు కేవలం లాహోర్, కరాచీ నగరాలకే పరిమితం చేశారు. ఉగ్రవాదులు ప్రేక్షకుల ముసుగులో వచ్చి ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని నిర్ణయించారు. భారీ జన సమూహాలను నివారించేందుకు గానూ ప్రారంభ వేడుకను కూడా రద్దు చేశారు.
ఐపీఎల్ ఎఫెక్ట్.. విదేశీ స్టార్ల దూరం!
ఓ వైపు ఉగ్రవాద ముప్పు.. మరోవైపు ఐపీఎల్ షెడ్యూల్ నేపథ్యం చాలా మంది విదేశీ స్టార్ ప్లేయర్లు పీఎస్ఎల్ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మరికొందరు ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ అనేది కేవలం ఓ క్రీడా టోర్నీగా కాకుండా.. భద్రత, ఆర్థిక ఒత్తిడి, ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఓ వివాదాస్పద ఈవెంట్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో టోర్నీని విజయవంతంగా పూర్తి చేయడం పాక్ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications