పంత్ ను యాక్సిడెంట్ నుంచి కాపాడి.. తాను సూసైడ్ .. ప్రేయసికి విషం ఇచ్చి..
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కు రోడ్డు ప్రమాదం జరిగింది గుర్తుంది కదా.. డిసెంబర్ 2022లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ ప్రమాదం నుంచి పంత్ ను కాపాడింది యూపీ యువకుడు రజత్ కుమార్(25), తన స్నేహితుడు నిషు కుమార్ తో కలిసి పంత్ ను యాక్సిడెంట్ నుంచి రక్షించారు.
అయితే ప్రస్తుతం రజత్ కుమార్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన ప్రియురాలు మన్నూ కష్యపతో కలిసి రజత్ విషం తాగి సూసైడ్ ప్రయత్నం చేశాడు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదన్న బాధతో ఈ నెల 9న తన ప్రేయసి మన్నూ కష్యపతో కలిసి రజత్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురైన వాళ్ళిద్దరినీ ఉత్తరాఖండ్ రూర్కీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ కష్యప మృతిచెందగా.. రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది.

రజత్, మన్నులు వేరువేరు కులాలు కావడం వల్ల ఇరు కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వాళ్లు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు రజత్ కుమార్ తమ కుమార్తెను కిడ్నాప్ చేసి విషం ఇచ్చాడని.. ఆమె మృతికి రజత్ కారణమని మృతురాలి తల్లి ఆరోపించింది.
2022లో పంత్.. దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వస్తున్న క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదం నుంచి పంత్ ను రజత్ కాపాడి వార్తల్లో నిలిచాడు.












Click it and Unblock the Notifications