పాకిస్తాన్ ఘాతుక చర్య- ముగ్గురు క్రికెటర్లు మృతి: షాక్ లో రషీద్ ఖాన్

పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై భారీగా వైమానిక దాడులకు దిగింది పాకిస్తాన్. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాక్.. దాన్ని ఉల్లంఘించింది. భారీగా వైమానిక దాడులకు పాల్పడింది. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న పక్టికా ప్రావిన్స్‌లో పలు ప్రాంతాలపై ఈ దాడులు సాగాయి. దీన్ని తాలిబాన్ అధికారికంగా ధృవీకరించింది కూడా.

అర్గూన్, బెర్మల్ జిల్లాల్లో పలు నివాసాలు ధ్వంసం అయ్యాయని ఆఫ్ఘన్ కు చెందిన టోలోన్యూస్ వెల్లడించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం పలువురు మరణించారు. ఈ నెల 11వ తేదీన ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై దాడి చేయడంతో కాన్ ఫ్లిక్ట్ మొదలైంది. ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ దాడుల్లో ముగ్గురు స్థానిక క్రికెటర్లు సైతం దుర్మరణం పాలయ్యారు.

Rashid Khan Mourns Afghan Cricketers and Civilians

పక్టికా ప్రావిన్స్ రాజధాని షరానాలో ఓ మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా.. పాక్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు సహా పలువురు మరణించారు. వారిని సిబ్ఘతుల్లా, హరూన్, కబీర్ ఆఘాగా గుర్తించారు. ఈ దాడుల్లో సంఘటనస్థలంలోనే వారు ప్రాణాలు వదిలారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుంది. ఆ దేశంలో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుండి తప్పుకుంది.

పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- శ్రీలంక జట్ల మధ్య నవంబర్ 17 నుండి 29 వరకు ఈ ముక్కోణపు సిరీస్ జరగాల్సి ఉంది. రావల్పిండి, లాహోర్‌.. దీనికి వేదిక. కిందటి నెలలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ ను ప్రకటించింది. తాజాగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ట్రై- సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలగింది. ఈ విషయాన్ని అధికారింగా వెల్లడించింది.

ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్ క్రీడారంగానికి, అథ్లెట్లు, క్రికెటర్ల కుటుంబాలకు తీరని లోటుగా భావిస్తోన్నామని తెలిపింది. ఈ దాడిని దురదృష్టకర ఘటనగా అభివర్ణించింది. బాధిత కుటుంబాలకు సంతాప సూచకంగా పాకిస్తాన్ లో జరగాల్సిన త్రైపాక్షిక టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

పాకిస్తాన్ సైనిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడంపై ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. త్రైపాక్షిక సిరీస్ నుండి వైదొలగడాన్ని సమర్థించారు. పాకిస్తాన్ వైమానిక దాడులు అనైతికమైనవి, అనాగరికమైనవిగా అభివర్ణించారు. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో తమదేశ అమాయక పౌరుల మరణం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో మహిళలు, పిల్లలు, అలాగే ప్రపంచ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన అని రషీద్ ఖాన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ల నుండి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వైదొలగాలనే నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపుతున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+