స్టార్ క్రికెటర్‌కు సర్జరీ: ఆ లీగ్ టోర్నమెంట్‌కు దూరం
లండన్: ఐసీసీ వరల్డ్ కప్ 2023 ముగిసిన తరువాత భారత జట్టు తీరిక లేని క్రికెట్ ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభమైంది. విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్.. విజయఢంకా మోగించింది. 26వ తేదీన రెండో టీ20 తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో షెడ్యూల్ అయింది.
ఆస్ట్రేలియాతో ఈ సిరీస్ ముగిసిన తరువాత దక్షిణాఫ్రికాతో సుదీర్ఘమైన ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడాల్సి ఉంది టీమిండియాకు. డిసెంబర్ 10వ తేదీన ఈ సిరీస్ మొదలవుతుంది. మూడు చొప్పున వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతుంది. భారత్.. ఈ సిరీస్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

దీని తరువాత ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది. జనవరి 11, 14, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ను ఇటీవలే రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఆమోదించాయి. షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేశాయి కూడా.
కాగా- ఈ సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ (Rashid Khan).. వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. లోయర్ బ్యాక్ పెయిన్‌కు విజయవంతంగా శాస్త్ర చికిత్స ముగిసింది. లండన్‌లో ఈ ఆపరేషన్ జరిగినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. మైనర్ సర్జరీయేనని తెలిపింది. ప్రస్తుతం డాక్టర్ జేమ్స్ అలీబోన్ పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది.
May Allah gave you speedy recovery
— Muj R 88 (@Mujeeb_R88) November 24, 2023
Get well soon Champion ❤️@rashidkhan_19 pic.twitter.com/kRyjzkjwc3
సర్జరీ కారణంగా రషీద్ ఖాన్ కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీనితో డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే బిగ్ బాష్ లీగ్ (BBL) టోర్నమెంట్‌కు రషీద్ ఖాన్ దూరం కానున్నాడు. బీబీఎల్‌లో అతను అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నాడు.












Click it and Unblock the Notifications