కేప్టెన్ గా రిషభ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం టీమిండియా- ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరగనున్నాయి. ఈ రెండింటికీ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కేప్టెన్ వ్యవహరించనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత అతను కమ్ బ్యాక్ కానున్నాడు. దాదాపుగా ఏడు నెలల తర్వాత మళ్లీ గ్రౌండ్ లో దిగనున్నాడు.
ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో పంత్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ కోలుకులేదు. ఫలితంగా ఆసియా కప్, వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్, ఆస్ట్రేలియా టూర్ కు అందుబాటులో లేకుండాపోయాడు. ఇప్పుడిప్పుడు కోలుకున్నాడు. వందశాతం ఫిట్ నెస్ ను సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికాతో నాలుగు రోజుల మ్యాచ్ కోసం ఎంపికయ్యాడు. ఏకంగా కేప్టెన్సీ క్యాప్ అందుకున్నాడు.

దక్షిణాఫ్రికా 'ఎ'తో జరిగే ఈ రెండు మ్యాచ్‌లకు సాయి సుదర్శన్ వైస్ కేప్టెన్ గా నియమితుడయ్యాడు. భారత టెస్టు జట్టు రెగ్యులర్ ప్లేయర్లు వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ తో పాటు పేస్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, మీడియం ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం వీరందరూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అది ముగియగానే స్వదేశానికి వస్తారు. రెండో మ్యాచ్ కు అందుబాటులో ఉంటారు.
దీనివల్ల రెండు మ్యాచ్ లకు వేర్వేరు జట్లను ప్రకటించింది బీసీసీఐ. తొలి మ్యాచ్ ఈ నెల 30న ఆరంభం కానుంది. రెండోది నవంబర్ 6న మొదలవుతుంది. ఈ రెండూ కూడా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా జరుగుతాయి. వరల్డ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఈ రెండూ జరుగనుండటం.. టీమిండియాకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
మొదటి నాలుగు రోజుల మ్యాచ్ కోసం ఇండియా 'ఎ' జట్టు- రిషబ్ పంత్ (కేప్టెన్ వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యష్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్
రెండో నాలుగు రోజుల మ్యాచ్ కోసం ఇండియా 'ఎ' జట్టు- రిషబ్ పంత్ (కేప్టెన్ వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.












Click it and Unblock the Notifications