పాక్ తో మ్యాచ్ వేళ సూర్య సేనకు రోహిత్ హెచ్చరిక, అది మానుకుంటేనే గెలుపు..!!
T20 World cup Ind Vs Pak: ప్రపంచ కప్ లో అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. భారత్ - పాక్ మధ్య కీలక మ్యాచ్ ఖాయమైన తరువాత ఫ్యాన్స్ లో కొత్త అంచనాలు మొదలు అయ్యాయి. అనేక తర్జన భర్జనల తరువాత భారత్ - పాక్ మ్యాచ్ ఖాయమైంది. ప్రపంచ కప్ లో పాక్ పైన మంచి ట్రాక్ రికార్డు ఉన్న టీమిండియా లో ఇప్పుడు కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. కాగా, ఈ సమయంలోనే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య సేనకు హెచ్చరిక చేసారు. గెలవాలంటే చేయాల్సిన మార్పులను సూచించారు.
ప్రపంచ కప్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈ ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆదివారం వేళ ఈ మ్యాచ్ ను ఫిక్స్ చేసారు. ఈ సండే బిగ్ ఫైట్ కోసం కోట్లాది మంది సిద్దం అవుతున్నారు. అయితే, ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తనదైన స్టైల్లో స్పందించారు. సూర్య సేనకు గట్టి హెచ్చరిక చేసారు.

గతంలో ఎవరు ఎప్పుడు గెలిచారనేది ఇప్పుడు అప్రస్తుతం అని పేర్కొన్నారు. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారని పేర్కొన్నారు.ఈ మ్యాచ్ పైన తన అంచనాలను వెల్లడించారు. చాలామంది భారత్‌ను ఫేవరెట్ అంటున్నారని.. అయితే, తాను ఆ పదాన్ని ఎప్పుడూ నమ్మలేదంటూ కొత్త విశ్లేషణ చేసారు.
క్రికెట్ గత పదేళ్లలో ప్రపంచ క్రికెట్ చాలా మారిపోయిందని విశ్లేషించారు. ఇప్పుడు చిన్న టీమ్స్ కూడా టీ20ల్లో బాగా ఆడుతున్నాయని చెప్పారు. గతంలో మనం ఎన్ని మ్యాచ్‌లు గెలిచాం, ఎవరిపై పైచేయి సాధించాం అనేది ఆ రోజు లెక్కలోకి రాదని రోహిత్ అభిప్రాయపడ్డారు. అందు లో భాగంగా మైదానంలో దిగాక ఏ జట్టు అయితే అత్యుత్తమ ప్రదర్శన ఇస్తుందో వారికే ఆ రెండు పాయింట్లు దక్కుతాయని వివరించారు. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లాల్సి వస్తుందంటూ టీమిండియా సభ్యులను రోహిత్ అప్రమత్తం చేసారు.
అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడగా, భారత్ ఏకంగా 7 సార్లు గెలిచి ఏకపక్ష ఆధిపత్యం ప్రదర్శించింది. పాకిస్థాన్ కేవలం 2021లో మాత్రమే భారత్‌పై గెలిచింది. 2021లో బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత జట్టులో రోహిత్ టీంలోనే ఉన్నారు. దీంతో.. ప్రేమదాస స్టేడియం లో జరిగే ప్రపంచ కప్ సమరం కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్న వేళ.. ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications