కోహ్లీ టీంలోకి రోహిత్..RCBలోకి హిట్ మ్యాన్ ఎంట్రీ
ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే దాని గురించి పెద్దన చర్చ నడుస్తోంది.ఈ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్‌ల విధివిధానాలపై ఐపీఎల్ యాజమాన్యం టీం ఓనర్లతో మీటింగ్ నిర్వహించింది. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ విధివిధానాల గురించి ఈ మీటింగ్‌లో ఖరారు చేయడం జరిగింది. కొత్తగా తీసుకువచ్చిన రూల్స్ ప్రకారం చాలామంది ఆటగాళ్లు తమ టీంను వదిలిపెట్టి, వేరే టీంల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలోనే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడటం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్‌లో అత్యధికంగా టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కాదని.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తొలగించడాన్ని అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌ను తొలగించి హార్దిక్ పాండ్యాకు ఎలా బాధ్యతలు అప్పగిస్తారంటూ ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా గత సీజన్‌లో ఘెరంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో జట్టు పగ్గాలు తిరిగి రోహిత్‌కు అప్పగించాలని అతని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రోహిత్‌ను తిరిగి కెప్టెన్ చేయడానికి జట్టు యాజమాన్యం పెద్ద ఆసక్తి చూపించడం లేదు. దీంతో రోహిత్ ముంబై జట్టును వీడాలని డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి.
కొత్తగా వచ్చిన రూల్స్‌ను బట్టి చూస్తే ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్‌లో భాగంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ ముంబై ఇండియన్స్‌కు గుడ్ బై చెబితే..అతని కోసం RCB, గుజరాత్ టైటాన్స్ టీంలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా RCB యాజమాన్యం రోహిత్ కోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా రెడీ ఉన్నట్టు కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు నుండి రోహిత్ శర్మను RCB జట్టులోకి తీసుకుని అతనికి కెప్టెన్సీ ఇవ్వాలనేది RCB మేనేజ్‌మెంట్ ఉద్దేశం. రోహిత్, విరాట్ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
అయితే స్టార్ ఆటగాళ్లిద్దరూ ఐపీఎల్‌లో ఆడనున్నారు. తద్వారా రోహిత్ శర్మ అనుభవాన్ని ఉపయోగించి చాంపియన్‌గా నిలవాలనేది RCB జట్టు కల. తాజాగా దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ స్పందించాడు. ఓ నెటిజన్.. రోహిత్ శర్మ ఆర్సీబీ కెప్టెన్‌గా వస్తే దానిపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగిన ప్రశ్నకు దినేష్ కార్తీక్ మౌనం వహించాడు. ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. డీకే ఇచ్చిన రియాక్షన్‌ను బట్టి.. రోహిత్ శర్మ ఆర్సీబీలోకి వస్తున్నాడంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. రోహిత్ ఆర్సీబీకి కెప్టెన్‌గా ఆడితే.. RCBకి తొలి ఐపీఎల్ ట్రోఫీ రావడం ఖాయం అంటున్నారు అతని ఫ్యాన్స్ రోహిత్, విరాట్ ఇద్దరు ఒకే టీంకు ఆడుతుంటే అభిమానుల ఆనందానికి అడ్డు ఉండదు. మరి రోహిత్ శర్మ RCB జట్టులోకి ఎంట్రీ ఇస్తే సీన్ ఎలా ఉంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications