7.2 కోట్లా ? ఆ టాప్ స్పిన్నర్ ను వదిలేసిన కావ్య..! పట్టేసిన రాజస్థాన్..!

ఇవాళ అబుదాబీలో జరుగుతున్న ఐపీఎల్ 2026 ఆటగాళ్ల వేలంలో పలు సంచలనాలు నమోదవుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఈ ఐపీఎల్ టోర్నీ కోసం గతంలో తమ జట్లలో ఉన్న పలువురు ఆటగాళ్లను కొన్ని జట్లు వదులుకుంటే, మరికొన్ని జట్లు వారిని పోటీ పడి దక్కించుకున్నాయి. అలాగే కొందరినీ ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ పోటీలోనే సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఓ టాప్ లెగ్ స్పిన్నర్ కోసం పోటీ పడ్డాయి.

లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కోసం ఇవాళ్టి ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల యాజమాన్యాలు చివరి నిమిషం వరకూ పోటీ పడ్డాయి. అందుబాటులో ఉన్న మొత్తానికి బిష్ణోయ్ ను దక్కించుకునేందుకు ఇరుజట్లూ తీవ్రంగా ప్రయత్నించాయి. దీంతో అతని ధర అంతకంతకూ పెరుగుతూ పోయింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు రవి బిష్ణోయ్ ను 7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో హైదరాబాద్ కు నిరాశ తప్పలేదు.

RR Splash 7 2 Cr on Ravi Bishnoi Outbid SRH in Thrilling IPL 2026 Auction Fight

రవి బిష్ణోయ్ వేలం కనీస ధర అయిన 2 కోట్ల దగ్గర మొదలైంది. అదే ధరకు కొనుగోలుచేసేందుకు రాజస్థాన్ ముందుకొచ్చింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ 2.2 కోట్లు ఇస్తామంది. ఆ తర్వాత చెన్నై దీన్ని 4.2 కోట్ల వరకూ పెంచుకుంటూ వెళ్లింది. దీంతో రాజస్థాన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 5.8 కోట్ల వరకూ వెళ్లింది. తర్వాత రాజస్థాన్ 6 కోట్ల వరకూ వెళ్లింది. అదే సమయంలో చెన్నై వెనక్కి తగ్గింది. ఆ స్ధానంలో హైదరాబాద్ జట్టు రంగంలోకి దిగి 6.2 కోట్లు ఆఫర్ చేసింది. అయినా రాజస్థాన్ పెంచుకుంటూ పోవడంతో చేసేది లేక హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ వెనక్కి తగ్గారు. దీంతో రాజస్థాన్ 7.2 కోట్లకు బిష్ణోయ్ ను దక్కించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+