క్రికెటర్ చాహల్ సంచలనం ..భార్యకు విడాకులు..?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా వివాహిక జీవితం గురించి అందరికి తెలిసిందే. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తాయి.దీంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయారు.దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

హార్దిక్ పాండ్యా బాటాలో తాజాగా మరో క్రికెటర్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ భార్యగా మాత్రమే కాకుండా, ఒక ప్రతిభావంతురలైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె తన ప్రత్యేకమైన డ్యాన్స్ వీడియోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటారు.

rumor that Yuzvendra Chahal is going to divorce his wife Dhanashree

ధనశ్రీ చిన్నప్పటి నుండి భరతనాట్యం నేర్చుకున్నారు. ఆమె తన స్వంత డ్యాన్స్ కంపెనీని కూడా స్థాపించారు. యుజ్వేంద్ర చాహల్ , ధనశ్రీ పేమ వివాహం చేసుకున్నారు. 2020లో వీరి వివాహం జరిగింది. అయితే డిసెంబర్ 22న వీరి పెళ్లి రోజు. పెళ్లి రోజున వీరిద్దరు విష్ చేసుకోలేదు. పైగా పెళ్లికి సంబందించిన విషయాలను సైతం గుర్తు చేసుకోలేదు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. సినీ విమర్శకుడు కమల్‌ఖాన్ అయితే ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ ఇప్పటికే విడిపోయారని చెబుతున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+