టీమిండియాలో విడాకుల కలకలం..భార్యలకు గుడ్ బై చెప్పిన ముగ్గురు క్రికెటర్లు...?

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. ఈ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు ప్రకటిస్తారో అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.తాజాగా సినిమా వారికి ఏమాత్రం తీసిపోని విధంగా టీమిండియా క్రికెటర్లు సైతం విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది టీమిండియా క్రికెటర్లు , తమ భార్యలకు విడాకులు ఇచ్చారు. కొంతమంది క్రికెటర్లు ఇదే బాటలో పయనిస్తున్నారు.టీమిండియా క్రికెటర్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

Rumors are circulating that three Team India cricketers are getting divorced

చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పుడే వీరి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. మరి ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో నిజంగానే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆర్తి అహ్లావత్ అనే అమ్మాయిని సెహ్వాగ్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

Rumors are circulating that three Team India cricketers are getting divorced

వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి వైవాహిక జీవితం 20 ఏళ్ల పాటు సజావుగానే సాగింది. అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీని కారణంగానే ఏడాది నుంచి వీరు విడివిడిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గతేడాది జరిగిన దీపావళి వేడుకల్లో సైతం సెహ్వాగ్ తన ఒక్కడి ఫొటోను మాత్రమే షేర్ చేశారు. తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. దీంతో తన భార్య ఆర్తి అహ్లావత్‌తో సెహ్వాగ్ 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ఆయన ముగింపు పలుకుతున్నట్టు సమాచారం.

Rumors are circulating that three Team India cricketers are getting divorced

మరో టీమిండియా క్రికెటర్ మనిష్ పాండే విడాకుల బాట పట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.మనిష్ పాండే కన్నడలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆశ్రిత శెట్టిని ప్రేమించి 2019లో వివాహం చేసుకున్నాడు. అయితే ఆశ్రితా శెట్టి, మనీష్ పాండేకి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ జంట కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో పాటు, పెళ్లి ఫొటోలు కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ జంట కూడా విడాకులు తీసుకోవడం ఖాయమంటూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఇందుకు కారణం కూడా వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ పెళ్ళి ఫోటోలను తొలగించడమే. ఇలా ఈ ముగ్గురు క్రికెటర్లకు సంబంధించిన విడాకుల వార్తలు ఇప్పుడు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+