సైనా నెహ్వాల్ షాకింగ్ పోస్ట్.. భర్తతో విడిపోతున్నట్టు అనౌన్స్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బిగ్ షాక్ ఇచ్చారు. తన భర్త, బ్యాట్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఆ పోస్టులో..
కొన్నిసార్లు జీవితం మనల్ని వేరే దిశల్లోకి నడిపిస్తుంది. ఎంతో ఆలోచించి, చర్చించిన తర్వాత నేను, కశ్యప్ ఇద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. గత జ్ఞాపకాలకు నేను రుణపడి ఉంటాను. ఇకపై అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రేమ - పెళ్లి..
సైనా, కశ్యప్‌లు ఇద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలుసుకున్నారు. అకాడమీలోనే వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు పది సంవత్సరాల ప్రేమించుకున్న ఈ జంట.. 2018లో హైదరాబాద్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడు సంవత్సరాల వివాహ జీవితం అనంతరం ఈ ఇద్దరూ ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కెరీర్..
సైనా 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి ప్రపంచ నంబర్ 1గా ఎదిగారు. జూన్ 2023లో చివరిసారిగా అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ఆమె ప్రొఫెషనల్ టూర్‌కు దూరంగా ఉన్నారు కానీ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ టూర్‌లో సైనా పేరు కనిపించకపోవడం.. ఇప్పుడు ఈ విడాకుల ప్రకటనతో ఆమె భవిష్యత్ కెరీర్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కశ్యప్ సైతం తనదైన శైలిలో రాణిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కామన్వెల్త్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి పేరు తెచ్చుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా కోచింగ్ వైపు మొగ్గు చూపుతున్నాడు. 2019 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధును ఓడించినప్పుడు సైనాకు కోచ్‌గా కశ్యప్ ఉన్న విషయం తెలిసిందే.
వీరి విడాకుల ప్రకటన భారత బ్యాడ్మింటన్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినప్పటికీ.. వారిద్దరికీ భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications