World Cup 2023: ప్రపంచ కప్ నుంచి హార్డిక్ అవుట్ - మరో ప్లేయర్ ఎంపిక..!!

ప్రపంచ కప్ సమరం కీలక దశకు చేరుకుండి. టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీస్ కు అధికారికంగా అర్హత సాధించింది. ఇక, టీమిండియాతో పాయింట్ల పట్టికలో పోటీ పడుతున్న సౌతాఫ్రికాతో రోహిత్ సేన బిగ్ ఫైట్ కు సిద్దమైంది. కోల్ కతా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇదే సమయంలో టీమిండియాకు షాకింగ్ న్యూస్ అందింది. ప్రపంచ కప్ నుంచి ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా దూరం అయ్యారు. ఆ స్థానంలో మరో పేసర్ ను ఎంపిక చేసారు.

టోర్నీకి హార్డిక్ దూరం:భారత ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా ప్రపంచ కప్ కు దూరమయ్యారు. పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండ గాయంతో హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన తర్వాత అతను నాకౌట్ గేమ్‌లకు ఫిట్‌గా ఉంటాడని అంతా భావించారు. కానీ, బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పాండ్యా స్థానంలో సీమర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎంపికయ్యాడు. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే పోరుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. అయితే, పేస్ త్రయం బూమ్రా, సిరాజ్, షమీ చెలరేగుతున్న వేళ ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక కీలకంగా మారుతోంది.

Seamer Prasidh Krishna was named as Hardiks replacement, will be available for match Against South Africa

ప్రసిద్ధ్ కృష్ణ కు పిలుపు:హార్డిక్ గాయంతో దూరమైన సమయం నుంచి టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. మిడిల్ ఆర్డర్ లో సూర్య కుమార్ ఇప్పటి వరకు పెద్దగా స్కోర్లు చేయకపోయినా.. అతని పైన టీం నమ్మకం ఉంచింది. ఒక దశలో పాండ్యా తిరిగి వస్తే టీం నుంచి బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ లేదా సూర్య కుమార్ లో ఒకరిని తప్పిస్తారనే అభిప్రాయం వినిపించింది. కానీ, ఇద్దరూ ఇప్పుడు టీంలో పోటీ పడి ఆడుతున్నారు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అయ్యర్ ఆట తీరుతో అతడి మార్పు ఆలోచన వెనక్కు వెళ్లిపోయింది. సౌతాఫ్రికా మ్యాచ్ నుంచి పాండ్యా అందుబాటులోకి వస్తారని భావించి..టీం కూర్పు పైన లెక్కలు అనేకం బయటకు వచ్చాయి. కానీ, ఇప్పుడు బీసీసీఐ అధికారికంగా పాండ్యా మొత్తంగా ఈ టోర్నీకి దూరం అయినట్లు వెల్లడించింది.

ప్రతీ మ్యాచ్ కీలకం:ఈ టీంలో పాండ్యా స్థానం భర్తీ కోసం ప్రసిద్ధ్ కృష్ణ ఎంపికయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం చెలరేగుతున్న భారత్ పేసర్ల త్రయం..స్పిన్నర్లను మార్చే అవకాశం లేదు. జడేజా బౌలింగ్ లో రాణించకపోయినా బ్యాటర్ గా కీలకంగా చివరి ఓవర్లలో కీలకంగా మారాడు. దీంతో, ప్రస్తుత టీంలో మార్పులు చేసే అవకాశం కనిపించటం లేదు. అందునా ఇక సౌత్రాఫ్రికాతో మ్యాచ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సెమీస్ లో జట్టు తుది కూర్పు చాలా కీలకంగా మారనుంది. దీంతో, పాండ్యా స్థానంలో మరో సభ్యుడిగా ప్రసిద్ధ్ కృష్ణ ను ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. వన్డేల్లో ప్రసిద్ధ్ కృష్ణ ట్రాక్ రికార్డు బాగానే ఉన్నా...అంతకు మించి అన్నట్లు గా ప్రస్తుతం బారత్ బౌలర్లు తీరు ప్రదర్శన బాగుంది. దీంతో, ఇప్పుడు పాండ్యా టీంకు దూరం కావటం ఎలాంటి ప్రభావం ఉంటుందనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+