శ్రేయాస్ అయ్యర్ పంట పండింది..ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు..!

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్-2025కు సంబంధించిన మెగా వేలం ఆదివారం మొదలైంది. మొత్తం 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం నేడు, రేపు జరగనుండగా.. అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లు రిటైన్ చేసుకున్నాయి. టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యార్ ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను దక్కించుకున్నాడు.

ప్రస్తుతం శ్రేయాస్ ధర రూ. 18 కోట్లకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోరాడాయి. పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. చివరిదాకా పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ధరకు చేతులెత్తేసింది. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ వశం అయ్యాడు.శ్రేయాస్ అయ్యర్‌కు పంజాబ్ జట్టు పగ్గాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Shreyas Iyer is the most expensive player in IPL history

బౌలర్ అర్షదీప్ సింగ్ సైతం జాక్ పాట్ కొట్టాడు. అర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.ఈక్రమంలోనే 15. 75 కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా.. పంజాబ్ జట్టు అతన్ని రూ. 18 కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి ద్వారా తిరిగి అర్షదీప్ సింగ్‌ను సొంతం చేసుకొంది. దీంతో అర్షదీప్ సింగ్ 18 కోట్లకు అమ్ముడుపోయి జాక్ పాట్ కొట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+