Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ind Vs Aus: నలుగురు స్పిన్నర్లతో బరిలోకి - టీం ఇండియాకు 'హెడే'క్..!!

Ind Vs Aus Semi Final Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్కంఠ భరిత మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. దుబాయ్ కేంద్రంగా సాగుతున్న తొలి సెమీస్ లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ టీంలో రెండు మార్పులతో బరి లోకి దిగుతుండగా.. రోహిత్ న్యూజీలాండ్ తో ఆడిన నలుగురు స్పిన్నర్ల మంత్రంతోనే ఆసీస్ పైన యుద్దానికి సిద్దమయ్యాడు. ఇప్పుడు అసలైన సమరానికి దుబాయ్ వేదికగా నిలుస్తోంది.

తుది జట్టులో
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుతుందా. ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఆసీస్ పైన విజయం సాధించి ప్రపంచ కప్ ఫైనల్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది క్రికెట్ ఫ్యాన్స్ వేచి చూస్తున్న విషయం. ఇప్పటికే దుబాయ్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో ఉన్న టీమిండియాను ఫేవరెట్‌గా భావిస్ తున్నా.. ఆసీస్ తో తల పడటం సులువైనది కాదు. ఆసీస్ కీలక ఆటగాళ్లు లేకపోయినా సెమీస్ దశ కు చేరుకుంది. ఇక, భారత్ నుంచి స్పిన్నర్ల పైనే భారీ అంచనాలు ఉన్నాయి. న్యూజీలాండ్ పైన విజయం అందించిన నలుగురు స్పిన్నర్లనే ఇక్కడా ప్రయోగిస్తున్నారు. సెమీ ఫైనల్ లో ఇప్పుడు అందరి చూపు వరుణ్ చక్రవర్తి పైనే ఉంది. షమీకు తోడుగా మరో సీమర్ గా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నారు.

Smith Won the toss choose to bat first Rohit continue to four spinners for Semi final against Australia

నలుగురు స్పిన్నర్లతో
అయితే.. సెమీ ఫైనల్ కావటంతో షమీతో పాటుగా మరో పేస్ బౌలర్ అవసరమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. షమికి తోడుగా మ్యాచ్ లోనూ హార్దిక్ బంతిని షేర్ చేసుకోనున్నాడు. నలుగురు స్పిన్నర్లను కొనసాగిస్తుండటంతో.. ఆసీస్ బ్యాటర్లను ఎంత త్వరగా పెవిలియన్ కు పంపిస్తారనేది కీలకంగా మారుతోంది. ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మాత్రం ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఆసీస్ బ్యాటర్ హెడ్‌ నుంచి భారత్ కు ఎప్పుడూ ప్రమాదమే. దీంతో, హెడ్ ను కంట్రోల్ చేసేందు కు కొత్త ప్లాన్ అవసరం. హెడ్ క్రీజులో నిలదొక్కుకుంటే నిలువరించే అవకాశాలు తక్కవే. ఇక.. స్మిత్, క్యారీ, మ్యాక్స్ వెల్ సైతం ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమ టీం ను విజయం వైపు తీసుకెళ్లే సామర్ధ్యం కలిగిన బ్యాటర్లు.

Take a Poll

వర్షం లేనట్లే
ఇక, మంగళవారం దుబాయ్‌లో వాతావరణం గురించి అందోళన నెలకొంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది. మ్యాచ్ మొదటి అర్ధభాగంలో ఉష్ణో గ్రత 30 డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉండవచ్చు. సాయంత్రం తర్వాత 25 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చు. దుబాయ్‌లో వర్ష సూచన లేక పోవటం క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ గా మారింది. ఇక, టాస్ కీలకంగా మారుతోంది. దుబాయ్ లోని మూడు పిచ్ లు భిన్న స్వభావం కలిగి ఉన్నాయి. మ్యాచ్ జరిగే పిచ్ ఆధారంగా తుది జట్టు ఎంపిక ఉంటుందని రోహిత్ వెల్లడించారు. దీంతో, ఈ హోరా హోరీ మ్యాచ్ లో రోహిత్ సేన విజయం సాధించి ఫైనల్ కు వెళ్లటం ఖాయమనే ఫ్యాన్స్ అంచనాలు ఏ మేర నిజమవుతాయో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+