స్మృతి మందాన ఎంగేజ్‌మెంట్: పెళ్లి తేదీ లీక్ చేసిన ప్రధాని మోదీ..!!
భారత మహిళా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ బ్యాటర్, వరల్డ్ కప్ విజేత స్మృతి మంధానా ఎంగేజ్‌మెంట్ జరిగింది.సంగీత దర్శకుడైన తన ప్రియుడు పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని స్మృతి మంధానా సోషల్ మీడియా రీల్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ సరదా వీడియోలో ఆమె సహచర క్రీడాకారిణులు జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి కూడా పాల్గొన్నారు.
సరదా వీడియోతో స్మృతి ప్రకటన
స్మృతి మంధానా, ఇతర భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారులతో కలిసి 'లగే రహో మున్నాభాయ్' సినిమాలోని 'సంఝో హో హీ గయా' పాటకు ఒక చిన్న, స్వీట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయ్యింది. క్లిప్ చివర్లో, స్మృతి తన నిశ్చితార్థపు ఉంగరాన్ని కెమెరాకు చూపించింది. దీని ద్వారా, గత కొంతకాలంగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న నిశ్చితార్థపు పుకార్లను ఆమె ధృవీకరించింది.

శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్థం చేసుకున్న స్మృతి మందానాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మోదీ ఓ ప్రత్యేకమైన సందేశాన్ని పంపారు. ఇద్దరు వారి వారి రంగాల్లో రాణించి అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆయన కోరారు.వారిద్దరూ సంతోషదాయకమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ నవంబర్ 23వ తేదీన జరిగే వారి వివాహానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్నెట్‌లో వెల్లువెత్తిన శుభాకాంక్షలు
స్మృతి మంధానా వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వెంటనే, నెటిజన్లు కామెంట్స్ సెక్షన్‌లో ప్రేమను, శుభాకాంక్షలను తెలిపారు.ఒక అభిమాని, "చివరకు స్మృతి డ్యాన్స్ చేసింది" అని కామెంట్ చేయగా..మరొకరు, "ఈ రోజు ఇంటర్నెట్‌లో ఇదే అత్యంత క్యూటెస్ట్ విషయం" అని జోడించారు.మరో కామెంట్, "వీడియో ఆఫ్ ది డే" అంటూ వైరల్ అయింది. వాళ్లు రహస్యంగా పెళ్లి చేసుకోవడం లేదనేది మరింత ఆనందం కలిగించే విషయమని.. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉందంటూ ఇంకొక నెటిజెన్ పోస్టు చేశారు.
గతంలో పలాష్ హింట్
గత నెలలో ఇండోర్‌లోని స్టేట్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పలాష్ ముచ్చల్ పెళ్లి గురించి హింట్ ఇచ్చారు. త్వరలోనే స్మృతి మంధానా "ఇండోర్ కోడలు" కాబోతోందని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.
మరోవైపు, స్మృతి మంధానా ఇటీవల ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో జట్టుకు చారిత్రక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించి, వృత్తిపరంగా కూడా అత్యున్నత శిఖరాన్ని చేరుకుంది. న్యూజిలాండ్‌పై మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో సహా, స్మృతి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 54.22 సగటుతో మొత్తం 434 పరుగులు చేసింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications