స్మృతి మంధానను పలాష్ ముచ్చల్ మోసం చేశాడా?
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చుట్టూ వివాదం ముసురుకుంది. నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సిన వీరి వివాహం.. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం కారణగా హఠాత్తుగా వాయిదా పడింది. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో కొత్త అలజడి మొదలైంది.
మోసం ఆరోపణలు.. వైరల్ అవుతున్న చాట్ స్క్రీన్‌షాట్లు
వివాహం వాయిదా పడిన కొద్దిసేపటికే.. పలాష్ ముచ్ఛల్ ఒక మహిళతో చేసినట్లు ఆరోపించబడిన వ్యక్తిగత చాట్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో (ముఖ్యంగా రెడిట్‌లో) వైరల్ అయ్యాయి. ఈ స్క్రీన్‌షాట్‌లను మొదట 'మేరీ డి'కోస్టా' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా, ఆ తర్వాత రెడిట్‌లో అవి వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ పోస్టులు చేసిన అకౌంట్ డీయాక్టివేట్ చేయబడింది. ఈ చాట్‌లు మే 2025 నాటివిగా తెలుస్తోంది. స్క్రీన్‌షాట్‌లలో పలాష్ ముచ్ఛల్ ఆ మహిళను స్విమ్మింగ్‌కు ఆహ్వానించడం, ఆమె తనతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి ప్రశ్నించగా.. అతను తడబడటం, ఆమెను కలవడానికి పదేపదే ఒత్తిడి చేయడం కనిపిస్తుంది. ఇది పలాష్ ఫ్లర్టింగ్ మెసేజ్‌లత, తనని తాను పొగుడుకుంటూ పంపిన చాట్‌గా ఆరోపణలు వచ్చాయి.

సోషల్ మీడియాలో చర్చ
ఈ స్క్రీన్ షాట్లు వైరల్ అయిన వెంటనే ఎక్స్ వేదికగా తీవ్ర చర్చ మొదలైంది. కొంతమంది వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొంతమంది, నేటి సోషల్ మీడియా యుగంలో దేనినైనా ఎడిట్ చేయవచ్చని.. కాబట్టి తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని హెచ్చరించారు. చాలా మంది నెటిజన్లు "ఒక పెద్ద ప్రమాదం నుంచి స్మృతి మంధాన తనను తాను రక్షించుకున్నారు" అని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో స్మృతి తండ్రి త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు.
వివాదం నడుమ అస్వస్థత.. పోస్టుల తొలగింపు
పెళ్లి వాయిదా తర్వాత 24 గంటల్లోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. పలాష్ ముచ్ఛల్‌కు కూడా అకస్మాత్తుగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. మరోవైపు స్మృతి మంధానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి నిశ్చితార్థం ఫోటోలు, ప్రపోజల్ వీడియోలతో సహా వివాహానికి సంబంధించిన అనేక పోస్టులను తొలగించడం అభిమానులను మరింత కలవరపరిచింది. ఈ పరిణామాలు క్రికెటర్, మ్యూజిక్ కంపోజర్ వివాహ వాయిదా వెనుక అసలు కారణాలపై అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications