ఆస్పత్రి పాలైన స్మృతి మంధాన కాబోయే భర్త!
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధాన వివాహ వేడుక వాయిదా పడింది. ఆమె తండ్రికి గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆదివారం జరగాల్సిన వివాహాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. లక్షణాలు బయటపడగానే అంబులెన్స్ ద్వారా స్మృతి తండ్రిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో తలెత్తిన ఈ ఆకస్మిక ఆరోగ్య సమస్యతో పెళ్లి వేడుకలు నిలిచిపోయాయి. తండ్రి లేకుండా పెళ్లి చేసుకోనని స్మృతి స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. స్మృతి కాబోయే భర్త పలాష్ ముచ్ఛల్ ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. పలాష్‌కు వైరల్ ఇన్‌ఫెక్షన్, ఎసిడిటీ ఎక్కువ కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే, అతని పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలిసింది. చికిత్సానంతరం పలాష్ ఇప్పటికే ఆసుపత్రి నుంచి హోటల్‌కు తిరిగి వచ్చాడు.

స్మృతి మంధాన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్: స్మృతి మంధాన కుటుంబ వైద్యుడు డా. నమన్ షా మాట్లాడుతూ.. ఆమె తండ్రి ఆరోగ్యాన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడితే, ఈరోజే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
"మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ మంధానకు ఎడమ వైపు ఛాతీ నొప్పి వచ్చింది. వైద్య పరిభాషలో దీనిని 'యాంజినా పెక్టోరిస్' అంటారు. లక్షణాలు కనిపించగానే ఆయన కుమారుడు నాకు ఫోన్ చేశాడు. అంబులెన్స్ పంపి, ఆసుపత్రికి తరలించాము. ఈసీజీ, ఇతర నివేదికల్లో కార్డియాక్ ఎంజైమ్‌లు పెరిగినట్లు తేలింది. అందుకే ఆయనను పర్యవేక్షణలో ఉంచాము," అని డా.నమన్ షా వెల్లడించారు. "రక్తపోటు కూడా పెరిగింది, దానిని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం బృందం పర్యవేక్షిస్తోంది. పరిస్థితి తీవ్రమైతే, యాంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి, ఆమె కుటుంబం మాతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు." అని డాక్టర్ తెలిపారుయ
మహారాష్ట్రలోని స్మృతి స్వస్థలంలో ఆదివారం జరగాల్సిన వివాహానికి ముందు వారం రోజుల వేడుకలు జరుగుతున్నాయి. మిగిలిన ఆచారాలు, వివాహ వేడుకల ప్రణాళిక విషయానికొస్తే, మొత్తం కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడింది. స్మృతి తండ్రి కోలుకునే వేగంపై సవరించిన వివాహ తేదీ, మిగిలిన వేడుకల షెడ్యూల్ ఆధారపడి ఉంటుంది.












Click it and Unblock the Notifications