RCB: పైనల్ కు వెళ్లేది ఆర్సీబీయేనా.. ఎందుకంటే..!

దాదాపు రెండు నెలల పాటు వినోదం పంచిన ఐపీఎల్ 2024 ముగింపు దశకు చేరుకుంది. ఇందులో రెండు క్వాలిఫయర్ మ్యాచులు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఉంది. లీగ్ మ్యాచ్ లు ముగింపు దశకు వచ్చే సారికి మొదటి స్థానంలో కేకేఆర్ ఉండగా.. రెండో స్థానంలో ఎస్ఆర్ హెచ్ ఉంది. ఇకు మూడు, నాలుగు స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఉన్నాయి.

అయితే సారి కప్పు ఎవరు కొడతారనేది ఆసక్తిగా మారింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఆర్సీబీ నాలుగో స్థానంలోకి దూసుకొచ్చింది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్సీబీ రెండో మ్యాచ్ లో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వరసగా ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ తర్వాతి ఆరు మ్యాచుల్లో వరసగా విజయం సాధించి నాలుగో స్థానానికి చేరింది.

Some say that Royal Challengers Bangalore is likely to go to the final

దీంతో ఈసారి కప్ ఆర్సీబీ కొడుతుందని కొంత మంది భావిస్తున్నారు. దీనికి ఒక లెక్క కూడా చెబుతున్నారు. గతంలో ముంబై ఇండియన్స్ ఇలాగే వరస మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ తర్వాత పుంజుకుని వరస మ్యాచుల్లో గెలవడమే కాదు కప్పు కూడా కొట్టింది. దీంతో ఇప్పుడు కూడా ఇలాంటి అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అంతే కాదు ఆర్సీబీ విజయం సాధించే అవకాశం ఉందని మరొక ఉదాహరణ కూడా చెబుతున్నారు.

కరణ్ శర్మ ఓ జట్టులో ఆ జట్టు కప్ కొడుతుందని వాదిస్తున్నారు. 2016 ఐపీఎల్ లో కరణ్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఉన్నాడు. అప్పుడు ఎస్ఆర్ హెచ్ కప్ కొట్టింది. కరణ్ 2017లో ముంబై ఇండియన్స్ లో ఉన్నాడు. అప్పుడు కూడా ఎంఐ కప్ కొట్టింది. 2018, 2021లో కరణ్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్నాడు. ఆ రెండు ఐపీఎల్ లలో కూడా సీఎస్కే కప్ సాధించింది. ఇప్పుడు కరణ్ శర్మ ఆర్సీబీ జట్టులో ఉన్నాడు. ఇప్పుడు కూడా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధిస్తుందని ప్రిడిక్షన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+