టీమిండియా ఎంత చెత్తగా ఓడిందంటే.. టెస్ట్ చరిత్రలో ఇదే తొలిసారి

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దారుణ పరాజయం పరిపూర్ణమైంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో ఘోరంగా ఓడిపోయింది. ప్రత్యర్థి నిర్దేశించిన 124 పరుగులను కూడా అందుకోలేక చాపచుట్టేసింది. 93 పరుగులకే చతికిలపడింది. గువాహటిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ అవే సన్నివేశాలు రిపీట్ అయ్యాయి. బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. 140 పరుగులకే ఆలౌట్ అయింది. ఏకంగా 408 పరుగుల తేడాతో మట్టికరిచింది.

ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర లిఖించింది. 2-0 తేడాతో భారత్ లో భారత్ ను ఓడించింది. 25 సంవత్సరాల నాటి రికార్డును తిరగరాసింది. గెలవడానికి 549 పరుగులు చేయాల్సిన దశలో రెండో ఇన్నింగ్ లో నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి రెండు వికెట్లను కోల్పోయింది టీమిండియా. 27 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో చివరిరోజు అంతే దారుణంగా ఇన్నింగ్ ను ఆరంభించింది. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

South Africa Won 1st Test series Vs India in India After 25 Years

నైట్ వాచ్ మెన్ కుల్ దీప్ యాదవ్ తొలుత బలి అయ్యాడు. సైమన్ హార్మర్ సంధించిన క్వికర్ ను అర్థం చేసుకోలేకపోయాడు కుల్ దీప్ యాదవ్. లోపిచ్ గా వచ్చిన ఆ డెలివరీని ఆడటంలో విఫలం అయ్యాడు. నేరుగా అది వికెట్లను గిరాటేసింది. దీంతో 40 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత్. ఆ తర్వాత వచ్చిన జురేల్ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. మూడంటే మూడే బంతులు ఆడి అవుట్ అయ్యాడు. అతను చేసింది రెండు పరుగులే.

వికెట్లకు కాస్త దూరంగా వేసిన బంతిని డిఫెండ్ ఆడటానికి ప్రయత్నించాడు జురెల్. అతను అనుకున్నంతగా టర్న్ కాలేదా బంతి. నేరుగా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ వైపు గాల్లోకి లేచింది. దీన్ని అద్భుతంగా అదుకున్నాడు ఎయిడెన్ మార్క్ రమ్. దీంతో 42 పరుగులకు నాలుగో వికెట్ పడింది. కేప్టెన్ రిషభ్ పంత్ కూడా త్వరగా అవుట్ అయ్యాడు. హార్మర్ బౌలింగ్ లోనే అతనూ పెవిలియన్ దారి పట్టాడు.

జురెల్ అవుట్ అయినట్టే పంత్ కూడా వెనుదిరిగాడు. హార్మర్ బౌలింగ్ లో దూసుకొచ్చిన బంతికి బ్యాట్ అడ్డు పెట్టాడు. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన బంతి నేరుగా మార్క్ రమ్ చేతుల్లో వాలింది. దీంతో 58 పరుగుల వద్ద అయిదో వికెట్ కోల్పోయింది భారత్. ఆ తర్వాత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మినహా ఏ ఒక్కరు కూడా బౌలర్ల ధాటికి ఎదురొడ్డి నిలవలేకపోయారు. అతనొక్కడే కొంత ప్రతిఘటించాడు. హాఫ్ సెంచరీ చేశాడు. 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

యశస్వి జైస్వాల్- 2, కేఎల్ రాహుల్- 6, సాయి సుదర్శన్- 16, కుల్ దీప్ యాదవ్- 5, జురెల్- 2, రిషభ్ పంత్- 13, వాషింగ్టన్ సుందర్- 16, నితీష్ కుమార్ రెడ్డి- 0, జస్ ప్రీత్ బుమ్రా- 1 (నాటౌట్), మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో సైమన్ హార్మర్ హీరో. మొత్తం ఆరు వికెట్లు నేలకూల్చాడు. టీమిండియా పతనాన్ని శాసించాడు. కేశవ్ మహరాజ్- 2, సెనురాన్ ముత్తుస్వామి- 1, మార్కొ జన్ సెన్ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ ఓటమితో భారత జట్టు ఓ చెత్త రికార్డును నెలకొల్పింది. 350కి పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+