Hyderabad: పాకిస్థాన్, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‍కు ప్రేక్షకులు దూరం..!

వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కు ముందు పలు జట్లు వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ లో సెప్టెంబర్ 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించరు. ఈ నెల 28న నిమజ్జనం, ఆ తర్వాత మిలాద్ ఉన్ నబీ పండగలున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కు భద్రత కల్పించలేమని హెచ్ సీఏకు పోలీసులు స్పష్టం చేశారు దీంతో హెచ్ సీఏ చేసేది ఏం లేక.. ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేసింది. దీంతో ఈ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది.

ఒకే రోజు రెండు పండుగలు రావడంతో భద్రత కల్పించడం సాధ్యం కాదని పోలీసులు చెప్పారు. దీంతో వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు బైసీసీఐ కార్యదర్శి జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. బీసీసీఐకి లేఖ రాసినట్లు.. బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చుస్తున్నట్లు హెచ్ సీఏ కు చెందిన దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. అక్టోబర్ 3న ఆస్ట్రేలియా, పాకిస్థఆన్ వార్మప్ మ్యాచ్ నిర్ణయించిన ప్రకారమే ప్రేక్షకుల మధ్య జరుగుతాయని పేర్కొన్నారు.

Spectators will not be allowed for the Pakistan-New Zealand warm-up match to be held at Uppal in Hyderabad

కాగా ఈసారి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023లో బౌండరీల దూరం ఎక్కువగా ఉండనుంది. బౌండరీ పరిమాణాన్ని 70 మీటర్ల కంటే ఎక్కువగా ఉంచాలని పిచ్ క్యూరేటర్లను ఐసీసీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వరల్డ్ కప్ లో సిక్స్ ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల్లో క్రికెట్ స్టేడియాలు పెద్దవిగా ఉంటాయి. సో ఇక్కడ లాంగ్ బౌండరీలు పెట్టేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకే ఈ వరల్డ్ కప్ లో బౌండరీలను 70 మీటర్లు ఉంచాలని ఐసీసీ ఆదేశించినట్లు సమాచారం.

బౌండరీలు ఎక్కవ దూరం ఉండడం వల్ భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చని తెలుస్తోంది. అయితే మ్యాచ్ ల్లో టూడీస్, త్రీడీస్ ఎక్కువ తీయాల్సి రావొచ్చు. అయితే బౌండరీలు దూరంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వరల్డ్ కప్ లో భాగంగా భారత తన మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్ 14న పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+