అనామక ఆటగాళ్లను కొంటావ్.. మళ్లీ జట్టు ఓడిపోయిందని ఏడుస్తావ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. విలువైన ఆటగాళ్లను కొనుగొలు చేయకుండా ఆమె చోద్యం చూస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్-2025కు సంబంధించిన మెగా వేలం ఆదివారం మొదలైంది. ఇప్పటి వరకు కావ్య మారన్ ఇద్దరి ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. మార్క్యూ సెట్ 2 ముగిసే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఇద్దరి ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది.
టీమిండియా పేసర్ మహ్మద్ షమీని దక్కించుకుంది. రూ. 10 కోట్లు చెల్లించి తీసుకుంది. హర్షల్ పటేల్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చేరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఈ ఆల్ రౌండర్ కోసం రూ. 8 కోట్లు చెల్లించింది. పంజాబ్ కింగ్స్ ప్రారంభంలో SRH యొక్క ప్రారంభ వేలం రూ. 6.50 కోట్లతో సరిపోలింది కానీ చివరి బిడ్‌తో సరిపోలడానికి నిరాకరించింది. దీంతో హర్షల్ పటేల్ చివరికి రూ.6.75 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చేరాడు.

విచిత్రంగా స్టార్ బ్యాట్స్‌మెన్లను వదిలిపెట్టి బౌలర్లను మాత్రమే కావ్య మారన్ వేలంలో దక్కించుకుంది. కిల్లర్ మిల్లర్‌గా గుర్తింపు పొందిన ఆటగాడు డేవిడ్ మిల్లర్ తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నప్పటికీ అతన్ని తీసుకోవడానికి కావ్య మారన్ ఆసక్తి చూపించలేదు. దీంతో డేవిడ్ మిల్లర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 7.50 కోట్లతో దక్కించుకుంది.దీంతో కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు మండిపడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి నుంచి కూడా మిడిల్ ఆర్డర్ లేక చాలా మ్యాచ్‌ల్లో ఓడిపోతోంది. డేవిడ్ మిల్లర్ వంటి ఫినిషర్ జట్టులో ఉంటే సన్‌రైజర్స్ బలం రెట్టింపు అయ్యేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మరో బౌలర్ అర్షదీప్ సింగ్ కోసం కావ్య మారన్ చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.ఈక్రమంలోనే 15. 75 కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా.. పంజాబ్ జట్టు అతన్ని రూ. 18 కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి ద్వారా తిరిగి అర్షదీప్ సింగ్‌ను సొంతం చేసుకొంది. దీంతో కావ్య మారన్‌కు నిరాశే ఎదురైంది.












Click it and Unblock the Notifications