Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాటేరమ్మ కొడుకుల రేంజ్ మ్యాటర్: ఫైనల్ పంచ్ సంవత్సరం గుర్తుంటుంది

Heinrich Klaasen: ఐపీఎల్ 2025 చిట్టచివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విశ్వరూప ప్రదర్శన చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో ఎలా ఆడిందో.. అదే తరహాలో చెలరేగింది. కోల్ కత నైట్ రైడర్స్ బౌలర్ల దుమ్ము దులిపింది. మరోసారి స్కోర్ బోర్డుపై భారీ స్కోరును జమ చేసింది ఆరెంజ్ ఆర్మీ.

నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కోల్ కత నైట్ రైడర్స్ కు 279 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించలేకపోయింది కేకేేఆర్. 168 పరుగులకే కుప్పకూలింది. 110 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఐపీఎల్ లో 250కి పైగా పరుగులు చేయడం సన్ రైజర్స్ కు ఇది అయిదోసారి. ఓ జట్టు ఇన్నేసిసార్లు 250కి పైగా పరుగులు చేయడం ఐపీఎల్ మొత్తానికీ ఇదే తొలిసారి.

SRH won by 110 runs against KKR after Heinrich Klaasen smashed ton

సన్ రైజర్స్ బ్యాటర్ల ప్రతాపానికి కోల్ కత బౌలర్లు చేతులెత్తేశారు. ఎలా బంతులు వేయాలో తెలియక తల పట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అపార అనుభవం ఉన్న బౌలర్లు సైతం చేష్టలుడిగిపోయారీ మ్యాచ్ లో. ఎలా వేసినా కూడా ఆ బంతులన్నింటినీ బౌండరీ లైన్లు, ఫెన్సింగులు దాటించారు.

ఎన్రిచ్ నోర్ట్జె, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ఆండ్రీ రస్సెల్.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బౌలర్లందరి ఎకానమీ 10కి పైగా నమోదైందంటే సన్ రైజర్స్ బ్యాటర్ల దూకుడు ఈ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి- ఆండ్రీ రస్సెల్. రెండు ఓవర్లల్లోనే 34 పరుగులు ఇచ్చుకున్నాడీ ఆల్ రౌండర్. కోల్ కత బౌలర్లల్లో సునీల్ నరైన్- 2, వైభవ్ అరోరా ఒక వికెట్ తీసుకున్నారు.

ఈ మ్యాచ్ లో సునామీని తలపించేలా బ్యాటింగ్ చేశాడు హెన్రిచ్ క్లాసెన్. 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాటౌట్ గా నిలిచాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. కోల్ కత ఇన్నింగ్ లో ప్రతి బౌలర్ కూడా క్లాసెన్ కాకా బాధితుడే. అబ్జల్యూట్ క్రికెటింగ్ షాట్లతో విరుచుకుపడ్డాడు. కంప్లీట్ మాస్టర్ మాస్ బ్యాటింగ్ చేశాడు. ఒక్కో షాట్ ఒక్కో పిడుగులా కనిపించి ఉండొచ్చు కోల్ కత బౌలర్లకు. ఐపీఎల్ లో ఇది మూడో జాయింట్ ఫాస్టెస్ట్ హండ్రెడ్.

అంతకుముందు- ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. మ్యాడ్ బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 32, ట్రావిస్ హెడ్- 40 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఆరు బౌండరీలు బాదాడు. ఇషాన్ కిషన్- 29, అనికేత్ వర్మ- 6 పరుగులు (నాటౌట్) చేశారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్ కత నైట్ రైడర్స్ ఏ దశలో కూడా ప్రతిఘటించలేకపోయింది. 18.4 ఓవర్లల్లో 168 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ లో మనీష్ పాండే ఒక్కడే కొంత పోరాడగలిగాడు. 23 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అతనే టాప్ స్కోరర్.

క్వింటన్ డికాక్- 9, సునీల్ నరైన్- 31, కేప్టెన్ అజింక్య రహానె- 15, అంగ్ క్రిష్ రఘువంశీ- 14, రింకూ సింగ్- 9, ఆండ్రీ రస్సెల్- 0, రమణ్ దీప్ సింగ్- 13, హర్షిత్ రాణా- 34, వైభవ్ అరోరా డకౌట్ అయ్యారు. సన్ రైజర్స్ ఇన్నింగ్ లో ముగ్గురు బౌలర్లు మూడేసి చొప్పున వికెట్లు పడగొట్టారు. జైదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, హర్ష్ దుబే మూడు చొప్పున వికెట్లు కూల్చారు.

ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఏ రేంజ్ లో ఆడిందో.. చివరి మ్యాచ్ లోనూ అదే స్థాయిలో రెచ్చిపోయింది. తొలి గేమ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ రేంజ్ లో ఆడలేకపోయింది. మొత్తం 14 మ్యాచ్ లల్లో ఏడింట్లో ఓడింది. ఆరింట్లో విజయం సాధించింది.

వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దయింది. అది రద్దు కాకపోయి వుంటే కథ మరోలా ఉండేది. చివరి మూడింట్లో కూడా దుమ్ము దులిపింది సన్ రైజర్స్. ఈ మూడు మ్యాచ్ లు ఆరంభం కావడానికి ముందు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కనిపించిన జట్టు.. ఇప్పుడు ఏకంగా ఆరో స్థానానికి ఎగబాకింది. 13 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+