Ind-Nz ODI: కివీస్ తో వన్డేలకు ఆ ఇద్దరు స్టార్లు అవుట్..! బీసీసీఐ కీలక నిర్ణయం..!

భారత్-న్యూజీలాండ్ మధ్య వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్ కు బీసీసీఐ సెలెక్టర్లు ఇవాళ జట్టును ప్రకటించబోతున్నారు. ఇందులో పలు సంచలనాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం కివీస్ తో వన్డే సిరీస్ కు ఇవాళ ప్రకటించే జట్టులో ఇద్దరు స్టార్ క్రికెటర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. ఇప్పటికే విశ్రాంతి లేకుండా ఫార్మాట్లతో సంబంధం లేకుండా వరుస మ్యాచ్ లు ఆడుతున్న వీరిద్దరికీ ఈసారి కివీస్ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

జనవరి 11, 14,18 తేదీల్లో న్యూజీలాండ్ తో వడోదర, రాజ్ కోట్, ఇండోర్ లో భారత్ మూడు వన్డేలు ఆడబోతోంది. ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఆడే భారత జట్టును ఇవాళ సెలెక్టర్లు ప్రకటిస్తారు. అయితే ఇందులో స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకూ కూడా విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. దీని వెనుక రెండు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. రాబోయే టోర్నీల్ని దృష్టిలో ఉంచుకునే వీరికి ఈ రెస్ట్ ఇవ్వబోతున్నారు.

Star Pacers Bumrah Pandya Likely to Get Rest for New Zealand Series

న్యూజీలాండ్ తో వన్డే సిరీస్ ముగిశాక ఐదు టీ20ల సిరీస్ ఉంది. ఇది ముగిశాక టీ20 వరల్డ్ కప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండు కీలక టోర్నీలకు బుమ్రా, పాండ్యా గాయాలు కాకుండా అందుబాటులో ఉండాలంటే వీరిద్దరికీ వన్డేల నుంచి విశ్రాంతి నివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే కివీస్ లో వన్డే సిరీస్ లో ఆడకుండా విశ్రాంతి తీసుకునేలా వీరిని ప్రోత్సహించే అవకాశం ఉంది. అప్పుడే కివీస్ తో టీ20 సిరీస్ తో పాటు టీ20 వరల్డ్ కప్ లోనూ వీరిద్దరి సేవల్ని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది. కివీస్ తో టీ20 సిరీస్ లో భాగంగా భారత్ జనవరి 21,23, 25, 28, 31 తేదీల్లో ఆదు మ్యాచ్ లు ఆడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ టీ20 వరల్డ్ కప్ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+