నాడు సంజూ పై సూర్య వెటకారం, ఇప్పుడు టోపీ తీసి సెల్యూట్..!!
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ చేరింది. సంజూ శాంసన్ భారత్ ను సెమీస్ కు చేర్చాడు. తన వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. సరైన సమయం లో తాను ఏంటో నిరూపించుకున్నాడు. సంజూ పైన నాడు వెటకారం చేసిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్... నేడు సంజూ కు టోపీ తీసి మరీ సెల్యూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం సంజూ పై ప్రశంసలు కురిపిస్తోంది. ఇక.. రెండో సెమీస్ లో టీం ఇండియా ఇంగ్లాండ్ తో ముంబాయి లో తల పడనుంది.
సంజూ శాంసన్. ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలతో ముంచెత్తుతున్న పేరు. ఈ పేరు సంజూకు సులభంగా రాలేదు. విండీస్ పైన చావో రేవో అన్నట్లుగా జరిగిన మ్యాచ్ లో ఎంతో ఒత్తిడి ఉన్నా.. తన బ్యాట్ తోనే తన సామర్ధ్యం ఏంటో చాటి చెప్పాడు. ప్రపంచ కప్ గ్రూప్ దశలో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వరుసగా విఫలమవుతున్నా సంజూను పక్కన పెట్టారు. సూపర్ 8లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సంజూ పై నాడు సూర్య చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో సారి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. నాడు సూర్య "సంజూను ఓపెనర్‌గా గానీ లేదా మూడవ స్థానంలో గానీ ఆడిస్తారా?" అని అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్య నవ్వుతూ వెటకారంగా జవాబిచ్చాడు. "అభిషేక్ లేదా తిలక్‌ని పక్కన పెట్టేయమంటారా? ప్రస్తుతం జరుగుతున్నది బాగానే ఉంది, దీన్నే కొనసాగిద్దాం" అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చాడు. అయితే, సూపర్ -8 మ్యాచుల్లో మొత్తం సీన్ మారిపోయింది. కానీ సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో పరిస్థితులు రివర్స్ అయ్యాయి.

సంజూకు సూర్య టోపీ తీసి సెల్యూట్... వైరల్
ఓపెనర్ అభిషేక్ వరుసగా విఫలం అవుతున్న వేళ.. కుడి- ఎడమ చేతి కాంబినేషన్ కోసం సంజూ ను జట్టులోకి ఎంపిక చేసారు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తప్పనిసరి పరిస్థితుల్లో సంజూను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన నిర్ణయాత్మక పోరులో కెప్టెన్ సూర్య త్వరగా అవుట్ అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న వేళ, సంజూ శాంసన్ తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించి టీం ను సెమీస్ కు తీసుకెళ్లాడు. ఒక వైపు అభిషేక్, ఇషాన్, సూర్య కుమార్ వరుసగా అవుట్ అయినా.. సంజూ చివరి వరకు నిలబడి జట్టును సెమీస్ లోకి సింగిల్ హ్యాండ్ తో తీసుకెళ్లాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టోపీ తీసి సంజూకు టేక్ ఓ బోవ్ అంటూ సెల్యూట్ చేసాడు. ఇది సంజూకు కేవలం గౌరవం మాత్రమే కాదు, గతంలో సూర్య చేసిన వ్యాఖ్యలకు ఒక రకమైన పశ్చాత్తాపం అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. దీంతో, ఇప్పుడు సంజూ శాంసన్ అభిమానులు "అవమానించిన చోటే సన్మానం పొందడం అంటే ఇదే" అంటూ పోస్టింగ్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications