టీ20 మహిళల వరల్డ్ ​కప్-2024 విజేత న్యూజిలాండ్

టీ20 వరల్డ్ ​కప్-2024 ఛాంపియన్స్​‌గా న్యూజిలాండ్ మహిళల జట్టు నిలిచింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కీవీస్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా తొలిసారి ప్రపంచకప్ టైటిల్​‌ను న్యూజిలాండ్ తన ఖాతాలో వేసుకుంది. 159 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓవర్‌లన్నీ ఆడి 126-9 స్కోర్‌​కే పరిమితమైంది.

లారా వోల్​వార్ట్ (33 పరుగులు) మాత్రమే రాణించింది. దీంతో సౌతాఫ్రికా జట్టు రన్నరప్​‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కివీస్ బౌలర్లలో అమెలియా కేర్, రోస్​మెరీ చెరో 3, కర్సన్, జొనాస్, బ్రూక్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

T20 Women s World Cup-2024 Winner New Zealand Team South Africa Defeated in Final

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అమెలియా కేర్ (43 పరుగులు), బ్రూకీ (38 పరుగులు) సూజీ బీట్స్ (32 పరుగులు) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో నొంకులెకొ 2, డి క్లర్క్, అయబొంగ, చొలే తలో వికెట్ తీశారు.

కాగా, ఇప్పటివరకు అత్యధికంగా ఆస్ట్రేలియా (2010, 2012, 2014, 2018, 2020, 2023) ఆరుసార్లు టైటిల్ దక్కించుకోగా, ఇంగ్లాండ్ (2009), వెస్టిండీస్ (2016) ఒక్కోసారి ఛాంపియన్​గా నిలిచాయి. ఇక తాజాగా ఛాంపియన్స్ జాబితాలోకి న్యూజిలాండ్ చేరిపోయింది.

మరోవైపు, న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్‌ మహిళల అంతర్జాతీయ క్రికెట్‌​లో అత్యధిక మ్యాచ్​‌లు ఆడిన ప్లేయర్‌​గా నిలిచింది. 2006లో అరంగేట్రం చేసిన బేట్స్ 18ఏళ్ల సుదీర్ఘ కెరీర్​లో ఇప్పటివరకు 334 మ్యాచ్​‌లు ఆడింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ రికార్డ్‌ను ఆమె బ్రేక్ చేసింది. టీమ్ఇండియాకు దాదాపు రెండు దశాబ్దాల కాలంలో మిథాలీ 333 మ్యాచ్‌​లు ఆడింది. కాగా, టైటిల్ బరిలో ఉన్నామంటూ వచ్చిన టీమిండియా మహిళల జట్టు సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. అయితే, పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నీలోనూ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా జట్టు భారత్ చేతిలో ఓటమిపాలై రన్నరప్ నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+