T20 World Cup 2024: జంబో టోర్నమెంట్: ఏకంగా 20 జట్లు పోటీ
వచ్చే సంవత్సరం జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. వచ్చే ఏడాది జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది.
వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ దీనిమీదే ఉంది. ఈ కప్ కొట్టాలనే పట్టుదల ప్లేయర్లల్లో కనిపిస్తోంది.

అది అంత సులువు కాకపోవచ్చు. ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోండటమే దీనికి కారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. అన్ని ప్రధాన జట్లతో పాటు కొత్తగా అర్హత సాధించిన పలు టీమ్స్.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, ఉగాండా, అమెరికా.. జట్లు వచ్చే ఏడాది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024ను ఆడబోతోన్నాయి.
ఈ 20 జట్లను కూడా నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉంటాయి. ఈ నాలుగు గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన రెండు జట్లు సూపర్ 8కు క్వాలిఫై అయినట్టు గుర్తిస్తారు. మళ్లీ సూపర్ 8 టీమ్‌లను రెండు గ్రూపులుగా చేస్తారు. ఈ రెండు గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్స్‌కు క్వాలిఫై అవుతాయి. సెమీస్ గెలిచిన రెండు జట్లు ఫైనల్స్‌లో తలపడతాయి.












Click it and Unblock the Notifications