సెమీస్ చేరిన నాలుగు జట్లు ఇవే: టీమిండియా టఫ్ ఛాలెంజ్.. !!

India vs England: టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 ముగిసింది. ఇక సెమీ ఫైనల్స్ వచ్చేశాయి. తొలి సెమీ ఫైనల్ గురువారం షెడ్యూల్ అయింది. సాయంత్రం 6 గంటలకు తరౌబా స్టేడియంలో మ్యాచ్ మొదలవుతుంది. గ్రూప్ 2లో అనూహ్యంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీ ఫైనల్స్ చేరిన ఆఫ్ఘనిస్తాన్‌ను ఎదుర్కొనబోతోంది దక్షిణాఫ్రికా.

అదే రోజు రాత్రి 8 గంటలకు రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ఇంగ్లాండ్‌తో తలపడనుంది టీమిండియా. వెస్టిండీస్‌ గుయానాలోని ప్రావిన్స్ స్టేడియం దీనికి వేదిక. ఈ రెండో సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఫైనల్స్‌లో ఢీకొట్టనున్నాయి. 29వ తేదీన బ్రిడ్జ్‌టౌన్ స్టేడియంలో ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది.

T20 World Cup 2024 India will take England in Semi final 2

గ్రూప్ 2లో అనూహ్యంగా తెర మీదికి వచ్చింది ఇంగ్లాండ్. వెస్టిండీస్‌కు ఆ అవకాశాలు ఉండొచ్చని భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది ఇంగ్లాండ్. దీనితో ఆ జట్టు పనైపోయిందని భావించినప్పటికీ- యునైటెడ్ స్టేట్స్‌ను భారీ తేడాతో ఓడించింది. అంతకుముందు మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలవడం ఆ జట్టుకు కలిసొచ్చింది.

T20 World Cup 2024 India will take England in Semi final 2

ఆడిన మూడు మ్యాచ్‌లల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లను సాధించింది. గ్రూప్ 2లో రెండో స్థానానికి చేరింది. వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సూపర్ 8 దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి. లోకల్ టీమ్ వెస్టిండీస్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ- సూపర్ 8లో ఆ జట్టు తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేదు.

T20 World Cup 2024 India will take England in Semi final 2

గ్రూప్ 1లో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయఢంకా మోగించింది. లీగ్స్ దశలోనూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అదే దూకుడును సూపర్ 8లో ప్రదర్శించింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను ఓడించింది. సెమీ ఫైనల్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

T20 World Cup 2024 India will take England in Semi final 2

ఇదే గ్రూప్ 1లో అద్భుతమే జరిగింది. తనకంటే బలమైన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను సూపర్ 8లో ఓడించడం ద్వారా అనూహ్యంగా సెమీస్‌లోకి రాగలిగింది ఆఫ్ఘనిస్తాన్. సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. నిలకడ లేకుండా, ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+