టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే జట్టు ప్రకటన: ప్లేయర్లు వీళ్లే
T20 World Cup 2024 New Zealand squad: ఐపీఎల్ 2024లో రసవత్తరంగా కొనసాగుతోంది. సగానికి పైగా టోర్నమెంట్ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అయింది. ఎనిమిది విజయాలు- 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిందా జట్టు.
పదేసి చొప్పున పాయింట్లను సాధించిన కోల్‌కత నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తరువాతి స్థానాలో నిలిచాయి. ఏకంగా అయిదు జట్లు దాదాపుగా ఒకేరకమైన నెట్ రన్‌రేట్‌ను సాధించాయి. ఫలితంగా- నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించాల్సిన ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది.

ఈ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ పలకరిస్తుంది. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. ఇందులో ఉన్నాయి.
ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మెగా ఈవెంట్‌లో భారత జట్టులో ఎవరికి చోటు లభిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.
టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్. 15 మంది ప్లేయర్లు ఉన్న టీమ్ ఇది. టీ20 వరల్డ్ కప్ ఆడబోయే దేశాల క్రికెట్ బోర్డులన్నీ కూడా మే 1వ తేదీ నాటికి తమ ప్లేయర్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. దీనిపై ఇదివరకే ఐసీసీ ఆయా బోర్డులకు సమాచారాన్ని పంపించింది.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ టీమ్‌ను ప్రకటించింది. జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యాన్ని వహిస్తాడు. ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిఛెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిఛెల్ శాంట్నర్, ఈష్ సోధీ, టిమ్ సౌతీలకు చోటు దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్డ్‌గా బెన్ సియర్స్ ఉంటాడు.












Click it and Unblock the Notifications