ఫైనల్‌లో ఊచకోత.. కివీస్‌పై రికార్డుల వర్షం!
T20 World Cup 2026 Final: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు రికార్డుల మోత మోగించారు. కివీస్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి టీమిండియా ఏకంగా 256 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. ముందుగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత ఓపెనర్లు క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడటంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది.
నిప్పులు చెరిగిన భారత బ్యాటర్లు
భారత స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 89 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతనికి వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. భారత యువ కెరటం అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి వేగవంతమైన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇది ఈ టోర్నీలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డు సృష్టించింది. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివరలో శివం దూబే 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో రెచ్చిపోవడంతో టీమిండియా 256 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించగలిగింది.

రికార్డుల సృష్టి
గతంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరుగా ఉన్న రికార్డును భారత్ తిరగరాసింది. గత ప్రపంచకప్ (2026)లో 176 పరుగులే అత్యధికంగా ఉండగా.. ఇప్పుడు టీమిండియా ఏకంగా 256 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఆ రికార్డును చెరిపేసింది. మిడిల్ ఆర్డర్‌లో జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్‌లో మ3 వికెట్లు తీసి భారత్‌ను కాస్త కట్టడి చేసే ప్రయత్నం చేసినా, చివర్లో శివం దూబే(26) మెరుపులతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.
తడబడిన మిడిలార్డర్:
ఈ భారీ స్కోరులోనూ భారత్‌కు కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. జేమ్స్ నీషమ్ వేసిన ఒకే ఓవర్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (డకౌట్) వికెట్లను కోల్పోవడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కివీస్ బౌలర్లలో జేమ్స్ నీమ్ నీషమ్ 3 వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ పడగొట్టారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications