Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్ టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

ఐసీసీ నుంచి ఎదురైన కఠిన ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎట్టకేలకు మెట్టు దిగింది. టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి తప్పుకుంటామన్న బెదిరింపులకు స్వస్తి పలికి, టోర్నీలో పాల్గొనే తమ 15 మంది సభ్యుల తుది జట్టును ఆదివారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది.

ఐసీసీ 'చెక్'.. పీసీబీ 'రిట్రీట్'

బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తొలగించినందుకు నిరసనగా, తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మొదట ప్రకటించారు. అయితే ఐసీసీ దీనిపై అత్యంత కఠినంగా స్పందించింది. ఒకవేళ పాక్ తప్పుకుంటే..పాకిస్థాన్‌తో అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేస్తామని,ఆసియా కప్ నుంచి పాక్‌ను శాశ్వతంగా తొలగిస్తామని, పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు ఎన్వోసీలు నిరాకరిస్తామని హెచ్చరించింది. ఈ ఆర్థిక, క్రీడాపరమైన ఆంక్షలు పాక్ క్రికెట్ ఉనికినే ప్రమాదంలో పడేస్తాయని గ్రహించిన పీసీబీ.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే జట్టును ప్రకటించింది.

t20 world cup 2026 Pakistan Announced squad Salman Ali Agha to Lead India vs Pak Clash on Feb 15

జట్టులో అనూహ్య మార్పులు

సెలెక్షన్ కమిటీ హెడ్ ఆకిబ్ జావేద్, హెడ్ కోచ్ మైక్ హెసన్ ఆధ్వర్యంలో ప్రకటించిన ఈ జట్టులో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా బాబర్ ఆజమ్ లేదా షాహీన్ అఫ్రిది కాకుండా, సల్మాన్ అలీ ఆఘాకు జట్టు పగ్గాలు అప్పగించారు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ, అనుభవం దృష్ట్యా బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదిలకు చోటు కల్పించారు.శ్రీలంక పిచ్‌లకు రౌఫ్ బౌలింగ్ శైలి సరిపోదని అతన్ని తప్పించారు. అలాగే బిగ్ బాష్ లీగ్ (BBL)లో పేలవ ప్రదర్శన కారణంగా మహ్మద్ రిజ్వాన్‌కు మొండిచేయి ఎదురైంది. అతని స్థానంలో ఉస్మాన్ ఖాన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

పాకిస్థాన్ తుది జట్టు (15 మంది సభ్యులు):

సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నాఫే (కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీం షా, సాహిబ్‌జాదా ఫర్హాన్ (కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), ఉస్మాన్ తారిక్.

భారత్ - పాక్ 'మహా సమరం' ఖరారు

పాక్ పాల్గొనడంపై సస్పెన్స్ వీడటంతో, క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ తన గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాక్ తన వేటను ప్రారంభిస్తుంది.

పాక్ షెడ్యూల్

ఫిబ్రవరి 7: పాకిస్థాన్ vs నెదర్లాండ్స్

ఫిబ్రవరి 10: పాకిస్థాన్ vs యూఎస్‌ఏ

ఫిబ్రవరి 15: భారత్ vs పాకిస్థాన్ (మహా సమరం)

ఫిబ్రవరి 18: పాకిస్థాన్ vs నమీబియా

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+