2007 రీ లోడింగ్, నాడూ నేటి సీనే - అదే రిపీట్ అయితే భారత్ దే ప్రపంచ కప్..!!
T20 World cup: టీ20 ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. టీమిండియా అసలు సెమీస్ చేరుతుందా లేదా అనేది సందేహంగా మారుతోంది. ఈ సమయంలో మాజీ క్రికెటర్లు భారత్ జట్టు బలాన్ని గుర్తు చేస్తున్నారు. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలవటంతో పాటుగా రన్ రేటు కీలకంగా మారిన వేళ.. కొత్త జోష్ నింపుతున్నారు. 2007 ప్రపంచ కప్ లో సైతం టీమిండియా ఇదే విధంగాస సూపర్ -8 తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. ఆ తరువాత ఏకంగా టోర్నీ గెలిచింది. ఇక.. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందా.. ఏం జరుగుతందనేది కీలకంగా మారుతోంది.
టీమిండియా సెమీస్ లెక్కల వేళ 2007 టీ 20 ప్రపంచ కప్ ను అభిమానులు గుర్తు చేసుకొంటు న్నారు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో కూడా టీమిండియా పరిస్థితి ఇలాగే కనిపిం చింది. అప్పుడు కూడా గ్రూప్ స్టేజ్‌లో అదరగొట్టిన భారత్, సూపర్-8లో తన తొలి మ్యాచ్‌ను న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ ఓటమితో అప్పట్లో కూడా అందరూ భారత్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అక్కడే అసలు మలుపు తిరిగింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై వరస విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆపై సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించి తొలి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ... చరిత్ర రిపీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

2007 లోనూ ఇదే పరిస్థితి.. అదే సీన్ రిపటీ అయితే
ప్రస్తుతం 2026 వరల్డ్ కప్‌లోనూ అలాగే కనిపిస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తుంది. సూపర్-8లో తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా పై ఓడిన భారత్, ఇప్పుడు 2007 నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే రానున్న రోజుల్లో టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌లను చిత్తుగా ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు నమోదు చేస్తే, సెమీస్ చేరడం ఖాయం. అదే జరిగితే, 19 ఏళ్ల క్రితం నాటి ఓటమి సెంటిమెంట్ భారత్‌కు మళ్ళీ వరల్డ్ కప్ తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. జింబాబ్వే ప్రస్తుతం చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియానే ఇంటికి పంపిన జింబాబ్వేను తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. అలాగే వెస్టిండీస్ సొంత గడ్డపై ఎప్పుడూ ప్రమాదకరమే. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు తన తప్పులను సరిదిద్దుకుని ఆడితే సెమీస్ కు వెళ్లేందుకు మార్గం సులువుగా మారుతుంది. దీంతో చరిత్ర రిపీట్ అవుతుందా.. టీమిండియా సెమీస్ చేరుతుందా అనేది జింబాబ్వే తో మ్యాచ్ తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications