T20 World Cup Super 8: సూపర్ 8 బెర్తులు ఖరారు..! మ్యాచ్ లు వీళ్ల మధ్యే..!
టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)లో భాగంగా సూపర్ 8 బెర్తులు ఖరారయ్యాయి. ఇప్పటికే ఏడు జట్లు వరుస విజయాలతో సూపర్ 8కు అర్హత సాధించగా.. ఇవాళ నమీబియాపై గెలుపుతో పాకిస్తాన్ కూడా ఈ ఎలైట్ గ్రూప్ లోకి అడుగుపెట్టింది. దీంతో ఈ 8 జట్ల మధ్య ఈ నెల 21 నుంచి సూపర్ 8 మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగా ఏ మ్యాచ్ ఎవరెవరికి మధ్య జరగబోతోందో ఇప్పుడు చూద్దాం..
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడతాయి. ఇందులో ఎక్స్ గ్రూపులో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. అలాగే వై గ్రూప్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. ఇందులో ప్రతీ గ్రూపులో టాప్ జట్టు గ్రూపులో రెండు, మూడు, నాలుగు స్ధానాల్లో ఉన్నజట్లతో పోటీ పడతాయి. అలా సూపర్ 8లో రెండు గ్రూపుల నుంచి మళ్లీ రెండేసి జట్లు చొప్పున మొత్తం నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.

ఈ లెక్కన తొలి మ్యాచ్ న్యూజీలాండ్-పాకిస్తాన్ మధ్య ఈ నెల 21 సాయంత్రం 7 గంటలకు జరగనుంది. రెండో మ్యాచ్ ఈ నెల 22న శ్రీలంక-ఇంగ్లండ్ మధ్య మధ్యాహ్నం 3 గంటలకు , మూడో మ్యాచ్ అదే రోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య సాయంత్రం 7 గంటలకు జరుగుతాయి. అలాగే నాలుగో మ్యాచ్ జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య ఈ నెల 23న సాయంత్రం 7 గంటలకు, ఐదో మ్యాచ్ ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య 24న సాయంత్రం 7 గంటలకు జరుగుతాయి.

అలాగే సూపర్ 8లో ఆరో మ్యాచ్ శ్రీలంక-న్యూజీలాండ్ మధ్య ఈ నెల 25న సాయంత్రం 7 గంటలకు, ఏడో మ్యాచ్ వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు, ఎనిమిదో మ్యాచ్ అదేరోజు సాయంత్రం 7 గంటలకు భారత్-జింబాబ్వే మధ్య జరుగుతాయి. 27న ఇంగ్లండ్-న్యూజీలాండ్ మధ్య సాయంత్రం 7 గంటలకుసూపర్ 8 మ్యాచ్ జరుగుతుంది. 28న శ్రీలంక-పాకిస్తాన్ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. దీంతో సూపర్ 8 దశ పూర్తవుతుంది. అనంతరం రెండు సెమీ పైనల్స్ ఉంటాయి. వాటిలో గెలిచిన రెండు జట్లు వరల్డ్ కప్ ఫైనల్లో తలపడతాయి. ఇందులో విజేతకు ట్రోఫీ దక్కుతుంది.












Click it and Unblock the Notifications